Home » Entertainment » Kota Srinivasa Rao Is Very Badly Insulted By Balayya
Entertainment

Kota srinivasa rao : బాలయ్య కాండ్రించి మోహం మీద ఉమ్మాడు.. కోట శ్రీనివాస రావు సంచ‌ల‌న కామెంట్స్‌..!

Authored By
vamana sai
The Telugu News | Updated on: August 23, 2021 4:53 pm
Advertisement

Kota srinivasa rao: టాలీవుడ్ సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ శైలి పూర్తి భిన్నంగా ఉంటుందనే విషయం ఇప్పటికే ఎన్నో సందర్భాలలో రుజువైంది. ఆయనకి కోపం వస్తే వెంటనే చూపిస్తాడని ఆయన నోటి దురుసు, చేతి వాటమే చెబుతుంటాయి. ఇంటర్వ్యూస్ లో కూడా ఆయన మాట్లాడే విధానం కొన్ని సార్లు ఆడవారికీ ఇబ్బందికరంగానూ ఉంటుంది. అయితే చేయి చేసుకోవడం అనేది ఆయన అభిమానుల మీదే..అది కూడా అభిమానం తోనే అని సమర్ధించుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఆయన తోటీ నటీ నటులతో ఎలా ప్రవర్తిస్తాడనేది అంత ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు.

Advertisement

kota-srinivasa-rao is very badly insulted by balayya

కానీ తాజాగా ప్రముఖ సీనియర్ నటులు కోట శ్రీనివాస్ రావు మాత్రం ఆయనకి బాలయ్య తో ఎదురైన ఓ దురదృష్టకరమైన సంఘటనను వెల్లడించారు. కోట శ్రీనివాస్ ఎలాంటి నటుడో అందరికీ తెలిసిందే. ఉన్న విషయం మొహమాటం లేకుండా మొహం మీదే మాట్లాడే రకం. కానీ ఎవరినీ నోప్పించరు..మాటలతో బాధించరు. ఈ విషయం ఇండస్ట్రీలో అందరూ చెపుతారు. ఒప్పుకుంటారు. వయసు రిత్యా అవకాశాలు తగ్గాయి గానీ లేదంటే ఆయనకి అవకాశాలు ఇచ్చే హీరోలు, దర్శకులు ఉంటే ఈ క్షణం మొహానికి మేకప్ వేసుకొని షూటింగ్ కి రెడీ అని కెమెరా ముందుకు వచ్చేస్తారు.

Advertisement

Kota srinivasa rao: పరుచూరి బ్రదర్స్ సైగలు చేసారు..బాలకృష్ణ కాండ్రించి మొహం మీద ఉమ్మాడు..!

Balakrishna

అయితే ఓసారి రాజమండ్రిలో కోట శ్రీనివాస్ కు బాలయ్య ఎదురయ్యారు. ఓ సినిమా షూటింగ్ కోసం ఆయన వచ్చారట. అలాగే జంధ్యాల షూటింగ్ కోసం కోట వచ్చారట. బాలయ్య ఎదురుపడే సరికి.. అక్కడే ఉన్న పరుచూరి బ్రదర్స్ కోటను చూసి పక్కకు తప్పుకోమని సైగలు చేసారట. కానీ ఆ విషయం కోటకు అర్థం కాలేదు.

Advertisement

kota srinivasa rao is very badly insulted by balayya

అదే సమయంలో బాలకృష్ణ రాగా, గౌరవంగా నమస్కారం బాబు అన్నారు. ఆయన మాత్రం కాండ్రించి మొహం మీద ఉమ్మేసి వెళ్లిపోయారట. ఇలా ఎందుకు అనేది మాత్రం కారణం తెలీదు. ఇదొక్కటే కాదు ఇలాంటి చేదు అనుభవాలు నా జీవితంలో చాలానే ఉన్నాయని బాధపడ్డారు కోట శ్రీనివాస్ రావు.

 

 

Advertisement

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి