Home » Entertainment » Krish About Manikarnika Controversy
Entertainment

మణికర్ణిక వివాదం.. క్లారిటీ ఇచ్చిన క్రిష్

Authored By
Admin
The Telugu News | Updated on: December 19, 2020, 10:16 am
Advertisement

అప్పట్లో మణికర్ణిక వివాదం ఎంతటి రచ్చను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ మీడియాలో ఇది బాగా వైరల్అయింది. మొత్తంగా అది క్రిష్, కంగనా, సోనూ సూద్ మధ్యజరిగింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం, తన పాత్ర నిడివి,ప్రాముఖ్యతను పెంచుకోవాలని కంగనా ఆరాటపడటంతో అసలు కథ మొదలైంది. చరిత్రను వక్రీకరించలేను అని క్రిష్ మొండిపట్టు పట్టడం, నువ్ చేయకపోతే నేను చేస్తాను అంటూ కంగనా ముందుకు దూకడంతో వివాదాం తారాస్థాయికి చేరింది. మొత్తానికి చివరకు డైరెక్టర్ పేరు నుంచి క్రిష్ పక్కకపోయింది.. కంగనా పేరు తెరపైకి వచ్చింది.

Advertisement

Krish about Manikarnika Controversy

అయితే ఈ విషయంపై క్రిష్ అప్పట్లో ఓ సారి నోరు విప్పాడు. మళ్లీ ఇన్నాళ్లకు మాట్లాడాడు. ‘మణికర్ణిక సినిమాను మొత్తం పూర్తి చేశాను. ఫస్ట్ హాఫ్ వాళ్లకు బాగా నచ్చింది. సెకండాఫ్ కూడా బాగుందన్నారు. కానీ కొన్ని రోజుల తరువాత సెకండాఫ్‌లోకొన్ని మార్పులు చేయాలి.. సోనూ సూద్ (సదాశివ్) పాత్రను తగ్గించి మళ్లీ రీ షూట్ చేద్దామని కంగనా టీం ఫోన్ చేసింది. కానీ అందుకు నేను ఒప్పుకోలేదు.

Advertisement

‘మీ పాత్రకు తగ్గిస్తున్నాం.. మళ్లీ రీ షూట్ చేయాల’ని సోనూసూద్‌కు కంగనా టీం కబురు పంపింది. అయితే వెంటనే సోనూ సూద్ నాకు ఫోన్ చేశారు. ‘మీరు రీ షూట్ చేస్తాను.. పాత్ర నిడివి తగ్గిస్తాను అంటూ నాకు ఓకే.. మీరు రీ షూట్ చేస్తున్నారా? ’అని అడిగాడు. దానికి ‘నేను చేయడం లేదు’ అని సోనూకు చెప్పాను. అదే విషయాన్ని సోనూ కంగనాకు చెప్పాడు. అలా కంగనాయే రీ షూట్ చేసుకుంది. అలా వివాదం మొదలైంది’అని క్రిష్ చెప్పుకొచ్చాడు.

Admin

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి