Home » Entertainment » Krithi Shetty Cry In Live
Entertainment

Krithi Shetty : లైవ్‌లో ఏడ్చిన కృతి శెట్టి.. ఎందుకో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Authored By
Sam C
The Telugu News | Published on: May 30, 2022, 2:30 pm
Advertisement

Krithi Shetty  : ఉప్పెన సినిమాతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. 2021లో విడుదలైన తన ఫస్ట్ సినిమాతోనే.. అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో కృతికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. నాగచైతన్యకు జంటగా బంగార్రాజు సినిమాలో కూడా ఆమె నటించింది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్‌ సినిమాలో కూడా నటించి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా మారింది. తాజాగా కృతిశెట్టి సుధీర్ బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రామ్‌కు జోడీగా `ది వారియర్‌`, నితిన్ సరసన `మాచర్ల నియోజవర్గం` చిత్రాలు చేస్తోంది.

Advertisement

కోవుడ్‌లో సూర్యతో కలిసి 41వ చిత్రంలో హీరోయిన్‌గా కూడా చేస్తోంది. అయితే ఈక్రమంలో తమిళనాట కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ప్రాంక్ స్టర్లు ఆశిక్, సారథిరన్ కృతిని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో కృతి కన్నీళ్లు పెట్టుకుంది. యాంకర్ల ప్రవర్తన చూసి ఆమె ఎమోషనల్ అయిపోయింది. యాంకర్లిద్దరూ ముందు కృతిశెట్టిని నేను ప్రశ్నలు అడుగుతానంటే, నేను అడుగుతానని ఒకరిపై ఒకరు కేకలు వేసుకున్నారు. అంతేకాదు.. హీరోయిన్ ఎదుటే కొట్లాకు కూడా దిగారు.

Krithi Shetty cry in live

Advertisement

Krithi Shetty : కృతిని భ‌య‌పెట్టేశారుగా..

ఏం జరుగుతుందో తెలియక కృతి భయపడిపోయింది. ఆ తర్వాత వారు ప్రాంక్ అనడంతో ఊపిరి పీల్చుకున్న కృతి.. మొదట నవ్వినా ఆపై దుఖం ఆపుకోలేక లైవ్‌లోనే ఏడ్చేసింది. దాంతో ఆమెకు సర్థిచెప్పారు సదరు యాంకర్లు.. ఆ తర్వాత ఎందుకు ఏడ్చారు, ఏమైంది అని ప్రశ్నించారు. ఎవరైనా కఠినంగా మాట్లాడితే తనకు అస్సలు నచ్చదని, భయం వేస్తుందని చెప్పుకొచ్చింది. మొత్తానికి కృతి ఏడుస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంత సున్నితంగా ఉంటే ఎలా అంటూ… ప్రశ్నిస్తున్నారు.కృతి ప్రస్తుతం చాలా సినిమాల్లో నటిస్తున్నా.. అందులో ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘ది వారియర్’. లింగుసామి దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కృతి ఓ అల్లరి పిల్ల పాత్రలో కనిపించనుంది. అయితే ఈ మూవీ తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి