Krithi Shetty : ఉప్పెన సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ యంగ్ బ్యూటీ క్యూట్ లుక్స్, కళ్ళతోనే హావభావాలు పలికించగలిగే కెపాసిటీ యువతలో మంచి క్రేజ్ తెచ్చిపెట్టేలా చేశాయి. ముంబైలో సెటిలయిన తుళు కుటుంబంలో జన్మించిన కృతి తండ్రి ఒక బిజినెస్ మాన్ కాగా తల్లి ఒక ఫ్యాషన్ డిజైనర్. చిన్ననాటి నుంచి సినిమాల మీద ఆమెకు ఆసక్తి ఉండేది కానీ మొదట ఆమెకు టీవీ యాడ్స్ లో నటించే అవకాశం దొరికింది. అలా ఆమె టీవీ యాడ్స్ లో నటిస్తూ 17 ఏళ్ల వయసులోనే హృతిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ థర్టీ అనే సినిమాలో ఒక స్టూడెంట్ పాత్రలో కనిపించింది ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో నటించేందుకు అనేక ప్రయత్నాలు చేసింది.
కృతి అందాల ఆరబోత… ఉప్పెన పాపులారిటీతో ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తోంది ఈ కన్నడ అందం. అందులో భాగంగా కృతి శెట్టి రామ్ పోతినేని హీరోగా వస్తోన్న వారియర్ చిత్రంలో నటిస్తోంది. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రెడ్ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ లింగుసామితో ‘ది వారియర్’ అంటూ ఓ పోలీస్ యాక్షన్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల రామ్ లుక్ ఒకటి విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
ట్రైలర్ కూడా అదిరిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కృతి శెట్టి సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది. ఈ అమ్మడు క్యూట్ లుక్స్ లో కేక పెట్టించే అందంతో మంత్ర ముగ్ధులని చేస్తుంది. చీరకట్టులో కృతి స్టన్నింగ్ లుక్స్ మైమరచిపోయేలా చేస్తుంది. చురకత్తుల్లాంటి చూపులతో యువత మనసులు కొల్లగొడుతోంది. కలర్ ఫుల్ డ్రెస్ లో ఆమె మత్తు కళ్ళని చూస్తే అభిమానులు మైకంలో మునిగిపోవడం ఖాయం. అంతలా ఆమె గ్లామర్ పిక్స్ ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం కృతి శెట్టి చేతినిండా సినిమాలు ఉన్నాయి. నితిన్ మాచర్ల నియోజకవర్గం, ది వారియర్ చిత్రాలని ప్రస్తుతం కృతి శెట్టి చేస్తోంది. అలాగే మరికొన్ని చిత్రాలకు ఆమె పేరు పరిశీలనలో ఉంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.