Home » Entertainment » Krithi Shetty Killing Lloks Viral
Entertainment

Krithi Shetty : ఆ విధంగా చూస్తుంటే కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టదా కృతి శెట్టి..!

Authored By
Sam C
The Telugu News | Published on: April 1, 2022, 6:00 pm
Advertisement

Krithi Shetty : వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన ఉప్పెన సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ సినిమా త‌ర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు వంటి చిత్రాల‌లో న‌టించి మెప్పించింది. 18 ఏండ్లలకే సినీ ఇండస్ట్రీని ఏలుతోంది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. వరుస గా అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ జాబితాలోకి చేరిపోతోంది. ఈ బ్యూటీ ఇప్పటికే క్రేజీ ప్రాజెక్టులను దక్కించుకుంటోంది. అందం, అభినయం, అదృష్టం ఇది రేర్ కాంబినేషన్. ఈ మూడు ఉంటే చాలు ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. సమంత, రష్మిక లాంటి హీరోయిన్స్ ఈ కోవకే చెందుతారు. తాజాగా ఈ లిస్ట్ లో చేరింది ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి. ఇరవై ఏళ్ళు నిండకుండానే కృతి టాలీవుడ్ ని ఊపేస్తుంది. కోలీవుడ్‌, బాలీవుడ్‌లోను క్రేజీ ఆఫ‌ర్స్ అందుకుంటుంది.

Advertisement

కృతి శెట్టి.. ఏకంగా తమిళ స్టార్ హీరో సూర్య సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఇటీవలనే సూర్య, డైరెక్టర్ బాలా కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ‘శివపుత్రుడు’ సినిమా తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ చేయడం పట్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. దాదాపు సూర్య 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ డైరెక్టర్ బాల తో కలిసి పని చేయనున్నారు. వీరు ఇరువురు కలిసి చేసిన చివరి చిత్రం ‘శివపుత్రుడు’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం లో సూర్య పాత్ర కి తెలుగు ,తమిళం లో మంచి పేరు రావడంతో ప్రేక్షకులలో ఈ కాంబినేషన్ పై మరిన్ని అంచనాలు పెరగనున్నాయి . ఈ చిత్రానికి 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్య మరియు జ్యోతిక నిర్మాత లు గా , రాజేశేఖర పాండియన్ సహా నిర్మాత గా వ్యవహరించనున్నారు.

krithi shetty killing lloks viral

Advertisement

Krithi Shetty : కృతి అందాల‌కు దాసోహం..

మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ కృతి శెట్టి ఈ చిత్రంలో సూర్య కి జోడీ గా నటించనుందని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ సినిమా కోసం కృతి శెట్టి కోటిన్న‌ర‌కు పైగా రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. కృతి శెట్టి క్రేజ్ చూసి నిర్మాత‌లు కూడా అమ్మ‌డు ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇఫ్పటికే కృతి.. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని సరసన ‘ది వారియర్’ మూవీలో నటిస్తుంది. అలాగే నితిన్ తో ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాల్లో నటిస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ అప్పుడ‌ప్పుడు ఫొటో షూట్స్‌తో మైమ‌రిపిస్తుంది. తాజాగా క్యూట్ లుక్స్ లో కేక పెట్టించింది. ఈ పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి