krithi shetty : పాపం బేబమ్మ పరిస్థితి ఇలా అయిందేంటి.. ఛాన్సుల కోసం నిర్మాతలకి బంపర్ ఆఫర్ ఇస్తుందిగా..!
krithi shetty : ఉప్పెన సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి జెట్ స్పీడ్‌తో దూసుకొచ్చింది కృతి శెట్టి. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా తెరకెక్కింది. యూత్‌ఫుల్ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ సినిమా సక్సెస్ లో హీరోయిన్ కృతి శెట్టి పాత్ర కి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కాయి. ఉప్పెన తర్వాత కృతి శెట్టిని వరుస ఆఫర్స్ పలకరించాయి. నానికి జంటగా శ్యామ్ సింగరాయ్ మూవీ చేసింది. అది కూడా సూపర్ హిట్. ఇక మూడో చిత్రం బంగార్రాజు చేయగ, ఇందులో విలేజ్ గర్ల్ పాత్రలో ఆకట్టుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు హిట్ కావడంతో బేబమ్మకి హ్యట్రిక్ హిట్ దక్కింది. గోల్డెన్ లెగ్ ఇమేజ్ సొంతం చేసుకుంది.
వరుస విజయాలు బేబమ్మ చెంతకి రావడంతో ఈ ముద్దుగుమ్మ రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేసింది. ఎప్పుడైతే రెమ్యునరేషన్ పెంచిందో అప్పటి నుండి హిట్స్ తగ్గాయి. ఏ హీరోతో సినిమా చేసిన అది ఫ్లాపుగా నిలిచింది. మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. వారియర్ చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. ఇక నాగ చైతన్యకు జంటగా నటించిన కస్టడీ మూవీపై భారీ ఆశలు పెట్టుకోగా, ఆ మూవీ కూడా నిరాశపరిచింది. ఇక ఇదే సమయంలో శ్రీలీల టాలీవుడ్ లో అడుగుపెట్టి కృతి శెట్టికి గట్టి పోటీ ఇచ్చింది. కృతికి వచ్చే ఆఫర్స్ మొత్తం ఆ భామనే లాగేసుకుంది. కృతి శెట్టికి టాలీవుడ్ లో గడ్డుకాలం మొదలైంది అని చెప్పాలి. ప్రస్తుతం ఒక్క అవకాశం కూడా ఆ భామకి రావడం లేదు.
krithi shetty : పాపం బేబమ్మ పరిస్థితి ఇలా అయిందేంటి.. ఛాన్సుల కోసం నిర్మాతలకి బంపర్ ఆఫర్ ఇస్తుందిగా..!
ప్రస్తుతం ఆమె తెలుగులో శర్వానంద్ కి జంటగా ఓ చిత్రం చేస్తున్నారు. మలయాళ, తమిళ భాషల్లో ఒకటి రెండు ఆఫర్స్ ఉన్నాయి. తెలుగులో నిలదొక్కుకోవాలని ఈ భామ బాగా ట్రై చేస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో అందాల డోస్ కూడా పెంచింది. అలానే నిర్మాతలకు కృతి శెట్టి బంపర్ ఆఫర్ ఇచ్చింది. రెమ్యునరేషన్ తగ్గించుకుందట. గతంలో రూ. 2 కోట్లు డిమాండ్ చేసిన కృతి శెట్టి కోటి, కోటిన్నర ఇచ్చినా పర్వాలేదని అంటుందట. మరి ఇప్పడైన నిర్మాతలు ఆమెని కరుణిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.
Palm Candy Benefits | ప్రాచీన కాలం నుంచీ మన వంటగదిలో ఒక ముఖ్యమైన స్థానం పొందిన తాటి బెల్లం,…
Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
This website uses cookies.