Home » Entertainment » Kubera First Day Collections Is
Entertainment

Kubera First Day Collections : కుబేర తొలి రోజు ఎంత క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిందో తెలుసా ?

Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Updated on: June 21, 2025 11:23 am
Advertisement

Kubera First Day Collections : శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందానా కీలక పాత్రలో నటించిన ‘కుబేర’ శుక్రవారం (జూన్ 20) ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ‘కుబేర’ ఫస్ట్‌ డే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.4 కోట్ల వరకు రాబట్టగా… ఆఫ్‌లైన్ సేల్స్‌ని బట్టి రూ.7 నుంచి రూ.9 కోట్ల వరకు కలెక్షన్ ఉండొచ్చని అంచ‌నా వేశారు.

Advertisement

Kubera First Day Collections : కుబేర తొలి రోజు ఎంత క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిందో తెలుసా ?

Kubera First Day Collections : మంచి వ‌సూళ్లే..

అయితే తొలి రోజు శుక్రవారం కుబేరా చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ దక్కింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రానికి తెలుగు స్టేట్స్ లో మంచి వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. కుబేరా ఓపెనింగ్ డే రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ పండింతులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

కుబేర మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు. రన్ టైం విషయంలో కంప్లైంట్ ఉన్నా.. కంటెంట్ బాగుంది అంటే, ఆడియన్స్ అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోరు అనే నమ్మకం మేకర్స్ లో బలంగా కనిపిస్తుంది.అక్కినేని నాగార్జున లాంటి సీనియర్ హీరో నటిస్తుండటంతో తెలుగులో ‘కుబేర’ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉండగా తమిళంలో మాత్రం ఘోరంగా ఉందట. ధనుష్ లాంటి అగ్రహీరో నటిస్తున్నా ప్రమోషన్లు సరిగ్గా చేయని కారణంగా తమిళ తంబీలు ఈ చిత్రాన్ని పట్టించుకోనట్లుగా తెలుస్తోంది.

Ramalingaiah Tandu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి