Home » Entertainment » Laal Singh Chaddha Unit Spent Heavily On The Promotion Of The Movie In Telugu
Entertainment

Laal Singh Chaddha : లాల్ సింగ్ చడ్డా తెలుగు ప్రమోషన్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా..!

Authored By
aruna
The Telugu News | Published on: August 2, 2022, 10:00 pm
Advertisement

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చడ్డా ఆగస్టు 11 వ తారీకు న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. హిందీలో రూపొందిన ఈ సినిమా ను తెలుగులో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా లో నాగ చైతన్య కీలక పాత్రలో నటించడం వల్ల తెలుగు సినిమా అన్నట్లుగా ప్రమోషన్ చేస్తే ఇక్కడ భారీ ఓపెనింగ్స్ ఉంటాయని భావిస్తున్నారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి ని ఈ సినిమా కు సమర్పకుడిగా వ్యవహరించేలా ఒప్పించారు. అందుకు గాను మెగాస్టార్ చిరంజీవి కి భారీ మొత్తంలోనే పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అంతేకాకుండా ఈ సినిమా కోసం భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ చేశారు. అందుకు గాను దాదాపుగా 5 నుండి 6 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని వార్తలు వస్తున్నాయి. ఒక హిందీ సినిమాకు ఈ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ కోసం ఖర్చు చేయడం ఇదే ప్రథమం అంటూ బాలీవుడ్ వర్గాల వారు మరియు టాలీవుడ్ వర్గాల వారి లో చర్చ జరుగుతోంది. చిరంజీవి మరియు నాగార్జున కూడా ఈ సినిమా యొక్క ప్రమోషన్ లో భాగస్వామ్యం అయ్యారు.. అందుకే ఇంత భారీ మొత్తంలో ఖర్చు అవుతుందని ట్రేడ్ వర్గాల సమాచారం.

Laal Singh Chaddha unit spent heavily on the promotion of the movie in telugu

Advertisement

ఈ సినిమాలో అమీర్ ఖాన్ మరియు నాగ చైతన్య కాంబో సన్నివేశాలు కేవలం 30 నుండి 40 నిమిషాలు మాత్రమే ఉంటాయి. అయినా కూడా నాగ చైతన్య సినిమా అన్నట్లుగా తెలుగు లో ఈ సినిమా ని ప్రమోట్ చేస్తున్నారు. సినిమాని ఎంత ప్రమోట్ చేసినా కూడా కంటెంట్ లేకపోతే ప్రేక్షకుల తిరస్కరణకు గురి కాక తప్పదు అని గతంలో పలు సినిమాల విషయలం లో నిరూపితం అయ్యింది. అమీర్ ఖాన్ సినిమా అంటే ఒక మోస్తరు కంటెంట్ కంపల్సరీ ఉంటుంది కనుక ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి నాగార్జున మరియు చిరంజీవి ముందుకు వచ్చారు. మరి వారి ప్రయత్నం తో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ ను రాబడుతుందేమో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి