Lady Conductor Jhansi : మరోసారి మాస్ స్టెప్పులతో దుమ్ములేపిన లేడీ కండక్టర్ ఝాన్సీ వీడియో వైరల్..!
Lady Conductor Jhansi : లేడీ కండక్టర్, గాజువాక డిపో.. ఇవి ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న పేర్లు. గాజువాక డిపో లేడీ కండక్టర్ ఝాన్సీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఫేమస్ అయింది. శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో గత వారం అంతా హంగామా చేసింది. ఆదివారం నాటి ఫుల్ ఎపిసోడ్ వీడియో, అందులో ఆమె డ్యాన్సులు, ఊపిన తీరు చూసి అందరూ షాక్ అయ్యారు. ఆమె తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పిన విషయాలెన్నో అందరినీ కదిలించాయి. తనకు డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని, ఇలా బట్టలు వేసుకుని డ్యాన్స్ చేస్తుంటే అందరూ బరి తెగించినదాన్ని అని అనేవారని, కానీ తానేమీ పట్టించుకోకుండా..
కష్టపడి తన ఫ్యామిలీని పోషించుకున్నానని చెప్పుకొచ్చింది. ఇక తనకు డ్యాన్స్ అంటే మహా ఇష్టమని, తన భర్త సపోర్ట్ వల్లే ఇక్కడి వరకు వచ్చానని పల్సర్ బైక్ పాటతో ఫేమస్ అయిన కండక్టర్ ఝాన్సీ శ్రీదేవీ డ్రామా కంపెనీ స్టేజ్ మీద తెలిపింది. ఇకపై ఝాన్సీ డ్యాన్స్ పర్ఫామెన్స్ ప్రతీ ఆదివారం ఉండబోతోన్నట్టు కనిసిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోను చూస్తే అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఇంతకు ముందు కంటే ఈ సారి మరింతగా రెచ్చిపోయినట్టు కనిపిస్తోంది. స్టెప్పులతో ఊపు ఊపేసింది.
Lady Conductor Jhansi Again Mass Steps in Sridevi Drama Company
రామ్ హీరోగా వచ్చిన దేవదాస్ సినిమాలో శ్రియా వేసిన ఐటం సాంగ్‌కు ఝాన్సీ అదరగొట్టేసింది. మాస్ స్టెప్పులు వేసి నడుమును తిప్పేసింది. ఝాన్సీతో పాటుగా యాంకర్ మంజూష సైతం అదరగొట్టేసింది. మొత్తానికి ఝాన్సీ మాత్రం మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఏక్ బార్ ఏక్ బార్ అంటూ రామ్ చరణ్ వేసిన ఫ్లోర్ స్టెప్పులను సైతం ఝాన్సీ వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
