
lady power star Sai Pallavi fans on fire due to not committing for movies
Sai Pallavi : ఫిదా తో ఫిదా చేసి టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా మారి పోయిన సాయి పల్లవి ఈ వారం విరాటపర్వం సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన విరాటపర్వం సినిమా కోసం గత కొన్ని ఏళ్లు గా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అదుగో ఇదుగో అంటూ సాయి పల్లవి అభిమానులను ఊరించి చివరకు విడుదలకు సిద్దం చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సాయి పల్లవి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆమె ఎక్కడకు వెళ్లినా కూడా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అద్బుతమైన స్పందన వస్తుండటంతో సాయి పల్లవి స్టామినా ఏంటో క్లారిటీ వస్తుంది.
సాయి పల్లవి ని ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు లేడీ పవర్ స్టార్ అంటున్నారు. అందువల్లనో లేదా మరేం కారణమో కాని నిజంగానే ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాదిరిగా ప్రవర్తిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆమె మీడియా ముందు ప్రవర్తించే విషయమై ఎలాంటి ఇబ్బంది లేదు. కాని సినిమాల ఎంపిక విషయంలోనే చాలా పెద్ద సమస్య కనిపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో స్వయంగా సాయి పల్లవి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సాయి పల్లవి సినిమా లను కమిట్ కాకుండా వచ్చిన ప్రతి ఆఫర్ ను కూడా కథ వినేసి వదిలేస్తుందట. కథ వినేందుకు ఆసక్తి చూపిస్తున్న సాయి పల్లవి సినిమాలకు మాత్రం కమిట్ అవ్వడం లేదని అంటున్నారు.
lady power star Sai Pallavi fans on fire due to not committing for movies
కేవలం లేడీ ఓరియంటెడ్ మూవీస్ కు మాత్రమే కాకుండా కమర్షియల్ మూవీస్ కు కూడా తాను సిద్దం అంటూ గతంలో పలు సార్లు చెప్పుకొచ్చింది. కాని స్కిన్ షో చేసేది లేదు అంటూ చెప్పుకొచ్చింది. అందమైన సాయి పల్లవి అంటే ఎంతో మందికి అభిమానం. అలాంటి సాయి పల్లవి నుండి కనీసం ఏడాదిలో రెండు మూడు సినిమాలు అయినా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాని సాయి పల్లవి విరాటపర్వం తర్వాత తెలుగులో చేస్తున్న సినిమా ఏమీ లేదు. దాంతో ఆమె ఈ ఏడాది మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుందనే నమ్మకం లేదు. అందుకే సినిమాల ఎంపిక విషయంలో ఈమె నిజంగానే పవర్ స్టార్ అన్నట్లుగా ఫీల్ అవుతుందా అంటూ అభిమానులు సున్నితంగా కోప్పడుతున్నారు.
Banana Peels: ప్రతిరోజూ వంట చేయడం అనేది ప్రతి ఇంట్లో సాధారణమే. అయితే రోజూ వాడే పాత్రలపై నూనె మొండి…
Miracle medicine : శీతాకాలం వచ్చిందంటేనే జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. కానీ…
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
This website uses cookies.