Sai Pallavi : సాయి పల్లవి నిజంగా పవర్ స్టార్‌ లా ఫీల్ అవుతుందని ఫ్యాన్స్ ట్రోల్స్‌

 Authored By prabhas | The Telugu News | Updated on :17 June 2022,3:30 pm

Sai Pallavi : ఫిదా తో ఫిదా చేసి టాలీవుడ్ లో టాప్ స్టార్‌ హీరోయిన్ గా మారి పోయిన సాయి పల్లవి ఈ వారం విరాటపర్వం సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన విరాటపర్వం సినిమా కోసం గత కొన్ని ఏళ్లు గా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అదుగో ఇదుగో అంటూ సాయి పల్లవి అభిమానులను ఊరించి చివరకు విడుదలకు సిద్దం చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సాయి పల్లవి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆమె ఎక్కడకు వెళ్లినా కూడా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అద్బుతమైన స్పందన వస్తుండటంతో సాయి పల్లవి స్టామినా ఏంటో క్లారిటీ వస్తుంది.

సాయి పల్లవి ని ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు లేడీ పవర్ స్టార్‌ అంటున్నారు. అందువల్లనో లేదా మరేం కారణమో కాని నిజంగానే ఆమె పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ మాదిరిగా ప్రవర్తిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆమె మీడియా ముందు ప్రవర్తించే విషయమై ఎలాంటి ఇబ్బంది లేదు. కాని సినిమాల ఎంపిక విషయంలోనే చాలా పెద్ద సమస్య కనిపిస్తుంది అంటూ సోషల్‌ మీడియాలో స్వయంగా సాయి పల్లవి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సాయి పల్లవి సినిమా లను కమిట్ కాకుండా వచ్చిన ప్రతి ఆఫర్‌ ను కూడా కథ వినేసి వదిలేస్తుందట. కథ వినేందుకు ఆసక్తి చూపిస్తున్న సాయి పల్లవి సినిమాలకు మాత్రం కమిట్ అవ్వడం లేదని అంటున్నారు.

lady power star Sai Pallavi fans on fire due to not committing for movies

lady power star Sai Pallavi fans on fire due to not committing for movies

కేవలం లేడీ ఓరియంటెడ్‌ మూవీస్ కు మాత్రమే కాకుండా కమర్షియల్‌ మూవీస్‌ కు కూడా తాను సిద్దం అంటూ గతంలో పలు సార్లు చెప్పుకొచ్చింది. కాని స్కిన్ షో చేసేది లేదు అంటూ చెప్పుకొచ్చింది. అందమైన సాయి పల్లవి అంటే ఎంతో మందికి అభిమానం. అలాంటి సాయి పల్లవి నుండి కనీసం ఏడాదిలో రెండు మూడు సినిమాలు అయినా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాని సాయి పల్లవి విరాటపర్వం తర్వాత తెలుగులో చేస్తున్న సినిమా ఏమీ లేదు. దాంతో ఆమె ఈ ఏడాది మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుందనే నమ్మకం లేదు. అందుకే సినిమాల ఎంపిక విషయంలో ఈమె నిజంగానే పవర్ స్టార్‌ అన్నట్లుగా ఫీల్‌ అవుతుందా అంటూ అభిమానులు సున్నితంగా కోప్పడుతున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి