
#image_title
Lavanya – Raj Tarun ; రాజ్ తరుణ్, లావణ్యల ప్రేమ వ్యవహారం కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారడం మనం చూశాం. ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ మీడియాకి మంచి స్టఫ్ ఇస్తున్నారు. దాదాపు దశాబ్దం పైగా వీళ్ళిద్దరూ సహజీవనం చేశానని, ఆమెతో శారీరకంగా సంబంధం ఉన్న మాట వాస్తవమే అని రాజ్ తరుణ్ కూడా మీడియా ముందు ఒప్పుకున్నాడు. అయితే కొందరి వల్ల రాజ్ తరుణ్ తనని పట్టించుకోవడం లేదని లావణ్య ఆరోపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్ తరుణ్ ను వదలను అని చెప్పుకొచ్చిన లావణ్య ఇప్పుడు ఊహించిన విధంగా రాజ్ తరుణ్ నాకు అవసరం లేదు అంటూ ఆమె మరో వివరణ ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇన్ని రోజులు నాకు సాయం దొరుకుతుందని నేను నాలుగు గోడల మధ్య జరిగిన విషయాలని బయటకి తెచ్చాను. ఏ రోజు రాజ్ తరుణ్ గురించి నేను బ్యాడ్‌గా మాట్లాడింది లేదు. ఇప్పుడు అతను నాతో ఎలాంటి సంబంధం లేదు అంటున్నాడు, పెళ్లి చేసుకోలేదు అని అంటున్నాడు. ఇక అన్ని మాటలు మాట్లాడిన తర్వాత నేను కూడా అతన్ని వద్దని అనుకుంటున్నాను. ఇన్ని రోజులు అతని కోసం నేను పోరాడింది నిజమే కానీ ఇప్పుడు వద్దని అనుకుంటున్నాను అంటూ లావణ్య తేల్చేసింది. ఇక నాతో ఇన్నాళ్లు ఆయన కలిసి ఉన్నాడంటే అది అత్యాచారం కిందకే వస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్తే నాపై తప్పుడు ఆరోపణలు చేసి కేసులు కూడా పెట్టారు. అసలు నా వల్ల వాళ్లకు ప్రాణహాని ఉంది అని అంటున్నారు.
నేను కేవలం ఒక క్లారిటీ కోసం మాత్రమే వెళ్లాను. ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వడం లేదు. అతనితో పదేళ్లు ఉన్నాను కాబట్టి ఒక సమాధానం కోసం మాత్రమే నేను వాళ్ళ ఇంటికి వెళ్లడం జరిగింది. దానికి బదులుగా వాళ్ళు న్యూసెన్స్ కేసు పెట్టారు. రాజ్ తరుణ్ నాతో పదేళ్లు ఉన్నాడు. కాబట్టి అతన్ని నేను కావాలని కోరుకున్నాను. కానీ ఇప్పుడు అతనే నన్ను వద్దు అనుకుంటున్నాడు కాబట్టి బలవంతంగా నేను అతన్ని నా దగ్గరకు తీసుకురావాలని అనుకోవడం లేదు. అతను లేడని ఫొటోకు దండ వేసుకొని బ్రతికేస్తా. అయితే నాకు జరిగిన అన్యాయానికి తగిన న్యాయం మాత్రం జరగాలని కోరుకుంటున్నాను.. అని లావణ్య వివరణ ఇచ్చారు. మరోవైపు రాజ్ తరుణ్ ఒక అమ్మాయిని ప్రైవేట్ గా ముద్దు పెట్టుకుంటున్న ఫోటో బయట పెట్టింది లావణ్య. ఆమె ఇద్దరి లోకం ఒకటే హీరోయిన్ అని చెప్పుకొచ్చింది.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.