Lavanya Tripathi : పెళ్లికి ముందు అతనితో లవ్ ఎఫైర్... పచ్చి నిజం బయటపెట్టిన లావణ్య త్రిపాఠి...!
Lavanya Tripathi : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాజాగా తన ప్రియుడు వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పెళ్లి అయిన తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ సినిమాలతో పాటు పలు రకాల వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ వస్తుంది. దీనిలో భాగంగానే తాజాగా లావణ్య త్రిపాఠి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో లావణ్య చాలా సాఫ్ట్ రోల్ ను సెలెక్ట్ చేసుకున్నట్లుగా అర్థమవుతుంది. ఇది ఇలా ఉండగా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా లావణ్య త్రిపాఠి…ఈ సందర్భంగా మాట్లాడుతూ తన లవ్ ఎఫైర్ ఫై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.దీంతో ప్రస్తుతం లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. అయితే వరుణ్ తేజ్ రాసికన్నాతో నటించిన తొలిప్రేమ సినిమాలో రాసి కన్నాకు ప్రపోజ్ చేసిన విధంగా తనకు కూడా ప్రపోజ్ చేశాడని లావణ్య త్రిపాఠి చెప్పుకోచ్చింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటగా మిస్టర్ అనే సినిమా షూటింగ్ సమయంలో మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యామని ఆ తర్వాత ఆ సినిమా షూట్ పూర్తి అయ్యే సమయానికి లవ్ లో పడ్డామని ఇక అప్పుడే వరుణ్ తేజ్ తనకు ప్రపోజ్ చేసినట్లుగా లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూలో తెలియజేశారు. తొలిప్రేమ సినిమాలో రాశి కన్నాకు ప్రపోజ్ చేసిన విధంగా వరుణ్ తేజ్ తనకు ఫ్లవర్ ఇచ్చి ప్రొపోజ్ చేశాడని దాంతో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కి ఫిదా అయ్యారని ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే గతంలో కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో వీరిద్దరిపై పలు రకాల రూమర్స్ వచ్చిన అవేమీ నిజం కాదు అంటూ చెప్పి వీరి మధ్య బంధాన్ని చాలా గోప్యంగా ఉంచారు. సోషల్ మీడియాలో ఎన్ని రూమ్స్ వచ్చినప్పటికీ మా మధ్య అలాంటిదేమీ లేదు అంటూ మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చిన ఈ దంపతులు తాజాగా ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకుని మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. అయితే దానికంటే ముందు 2023 జూన్ 9న కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.
అనంతరం నవంబర్ 1 వివాహం జరిగింది. ఇటలీలోని టస్కానిలో వీరిద్దరి పెళ్లి బంధు మిత్రుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇలా నటీనటులు పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ లిస్టులోకి వరుణ్ తేజ్ లావణ్య చేరడంతో ప్రస్తుతం వీరిని తెలుగు సినీ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ గా అభిమానులు పిలుచుకుంటున్నారు. అదేవిధంగా కొంతమంది ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా విడాకులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇలాంటి పరిస్థితితులో వీరిద్దరూ ఎప్పటికీ అలా ఉండకూడదని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు .
GST 2.0 : జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్ర…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే…
Oneplus | ప్రీమియం లుక్, ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికీ మంచి సమయం ఇది. రూ.30,000 - రూ.40,000…
AP District Court Jobs | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న…
Bigg Boss9 | తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9’ సెప్టెంబర్…
Anushka Shetty | టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై…
Allari Naresh | అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆల్కహాల్. ఈ సినిమా మెహర్ రాజ్…
Water | ఉదయం లేవగానే చాలామందికి బ్రష్ చేయడం, తర్వాత వెంటనే నీళ్లు తాగడం అలవాటు. కానీ పెద్దవాళ్లు "బ్రష్ చేసిన…
This website uses cookies.