Liger Moive : విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లైగర్ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దుబాయ్‌లో ఉంటూ టాలీవుడ్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ విమర్శకుడు, ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు గురించి చాలా మందికి తెలుసు. ఇప్పటికే ఆయన చాలా తెలుగు సినిమాలకు ఫస్ట్ రివ్యూలు ఇచ్చారు. ఇప్పుడు ‘లైగర్’కి కూడా రివ్యూ ఇచ్చేశాడు. విజయ్ దేవరకొండ సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకొని నడిపించాడని, యాక్షన్ స్టంట్స్ అదరగొట్టేశాడని రివ్యూలో చెప్పుకొచ్చాడు. టెర్రిఫిక్ యాక్షన్ స్టంట్స్. డైరెక్షన్ అదిరిపోయింది. ఈ సినిమాలో రమ్యకృష్ణది ఒక సర్ ప్రైజ్ ప్యాకేజ్. అయితే స్టోరీ, స్క్రీన్ ప్లే మాత్రం యావరేజ్ గా ఉన్నాయి’ అని ఉమైర్ సంధు తన రివ్యూను ఇచ్చారు.
అయితే కొద్ది రోజులుగా కొన్ని సినిమాలకు నెగెటివ్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు. బాయ్‌కాట్ ట్రెండ్ తో ఫుల్ నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పుడు లైగర్ సినిమాకు కూడా తాకింది. అటు నార్త్‌లో లైగర్‌ను టార్గెట్ చేస్తూ బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తుంటే.. టాలీవుడ్‌లో కొందరు హీరోల ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ నెగటివిటి స్ప్రెడ్ చేసేందుకు కాచుకుని ఉన్నారని.. వారి సోషల్ మీడియా పోస్టులే చెపుతున్నాయి. చివరకు ఈ నెగటివిటిని తట్టుకునేందుకు సినిమా మేకర్స్ విజయ్ పీఆర్ టీంతో పాటు మరో టీంను ఏర్పాటు చేసుకుని పాజిటివిటిని స్ప్రెడ్ చేస్తోంది. ఏదేమైనా ఈ తరహా విధానాన్ని ఎవరైనా ఖండించాల్సిందే.
బింబిసారకు హిట్ టాక్ రావడంతో అందరు హీరోల అభిమానులు భుజానకెత్తుకుని మోశారు. అయితే ఇప్పుడు రేపు రిలీజ్ అవుతోన్న విజయ్ దేవరకొండ లైగర్‌ను టార్గెట్ చేస్తూ నెగటివిటి స్ప్రెడ్ చేసేందుకు కొందరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. విజయ్‌కి తక్కువ టైంలో ఈ రేంజ్ క్రేజ్ రావడంతో కొందరు కావాలని ఇలా నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. మరి రేపు సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఇది కొనసాగుతుందా లేదా అనేది చూడాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.