
Liger : లైగర్ విజయ్ దేవరకొండ – బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న తాజా చిత్రం. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్ సమర్పణలో పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 9న లైగర్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఇప్పటికే లైగర్ సినిమా ముంబై లో 40 శాతం టాకీపార్ట్ కంప్లీట్ అయింది. ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కాగా 120 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండటం విశేషం.
liger-shooting-begins-vijaydevarakonda-entered-mumbai
అయితే లైగర్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరిలో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవనుందనే టాక్ మొదలైంది. అందుకు కారణం లాక్ డౌన్ తర్వాత ప్రతీ సినిమా సెట్స్ మీదకి వచ్చింది. కాని పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండల లైగర్ మాత్రం మొదలవలేదు. అందుకే ఈ టాక్ వచ్చి హాట్ టాపిక్ అయింది. కాగా ముంబై లోనే మళ్ళీ లైగర్ షుటింగ్ మొదలు పెట్టబోతున్నాడు పూరి. ఇప్పటికే పూరి టీం ముంబై లో ఉండగా హీరో విజయ్ దేవరకొండ కూడా ముంబై లో దిగాడు.
తాజాగా విజయ్ దేవరకొండ లైగర్ షూటింగ్ కోసం ముంబై స్టార్ అయినట్టు ఫ్లైట్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఫొటోటోస్ ని నిర్మాత ఛార్మి.. సోషల్ మీడియా వేదికగా వెల్లడించంది. ఈ ఫోటోస్ లో విజయ్ దేవరకొండ లుక్ అదిరిపోయింది. పక్కా పాన్ ఇండియా అప్పిల్ కనిపిస్తోంది. ఇలాంటి హీరో తో పూరి తప్ప మరెవరు పాన్ ఇండియన్ సినిమా చేయలేడని చెప్పుకుంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా లైగర్ ని బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాధ్. బాక్సర్ గా కనిపించబోతున్న విజయ్ దేవరకొండ లుక్ ఇప్పటికే విపరీతంగా ఆకట్టుకుంది.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.