Home » Entertainment » Lot Of Rumors Spreads On Tamannaah
Entertainment

Tamannaah : త‌మ‌న్నాపై ఈ త‌ప్పుడు ప్ర‌చారాలు ఎందుకు.. అమ్మ‌డిని టార్గెట్ చేసేవారెవ‌రు..!

Authored By
Sam C
The Telugu News | Published on: April 10, 2022, 5:30 pm
Advertisement

Tamannaah : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా టాలీవుడ్‌లో త‌న అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఐటెం సాంగ్స్ ఇలా నిత్యం ర‌చ్చ చేస్తూనే ఉంటుంది.ప్ర‌స్తుతం చేతినిండా చాలా సినిమాల‌తో బిజీగా ఉంది త‌మ‌న్నా. అయితే ఈ అమ్మ‌డి గురించి ఇటీవ‌ల త‌ప్పుడు ప్ర‌చారాలు చాలా వ‌స్తున్నాయి. ఎవరితోనో డేటింగ్ చేస్తుంద‌ని కొంద‌రు ప్ర‌చారం చేయ‌గా, మ‌రి కొంద‌రు పెళ్లి చేసుకుంటుంద‌ని అంటున్నారు. ఇంకొంద‌రు చిత్ర బృందంతో గొడ‌వ‌లు ప‌డుతుంద‌ని చెప్పుకొస్తున్నారు. ఇందులో నిజాలేంట‌నే దానిపై మాత్రం క్లారిటీ రావ‌డం లేదు.

Advertisement

హీరోయిన్ తమన్నా కు ఎఫ్ 3 యూనిట్ కు మధ్య గట్టి గొడవ జరిగిందని వార్త‌లు వ‌చ్చాయి. ఆమె డేట్ లు కేటాయించడం. షూటింగ్ కు రావడం వంటి విషయాల్లో అంత స్పష్టత వుండదని, బాగా డిలే అవుతూ వుంటుందని వినిపిస్తూనే వుంటుంది. ఇలాంటి విషయంలోనే ఎఫ్ 3 సెట్ లో కొన్ని వారాల క్రితం చిన్న గడబిడ అయిందని బోగట్టా. అది చినికి చినికి గాలివానగా మారి, నిర్మాత దిల్ రాజు యూనిట్ కు తమన్నాకు మధ్య వివాదం బిగుసుకుపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ మ‌ధ్య టీవీ షో హోస్ట్ చేయ‌గా, అప్పుడు కూడా ఈ అమ్మ‌డికి నిర్వాహ‌కుల‌తో చిన్నపాటి యుద్ధం జ‌రిగింద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

lot of rumors spreads on Tamannaah

Advertisement

Tamannaah : త‌మ‌న్నాపై త‌ప్పుడు ప్ర‌చారం..!

ఇక తాజాగా త‌మ‌న్నా పెళ్లి గురించి కూడా వార్త‌లు వ‌చ్చాయి. మూడు పదులు దాటిన తమన్నా పెళ్లిపై రకరకాల వార్తలొస్తున్నాయి. చాలా రోజులుగా ఆమె మ్యారేజ్‌ కి సంబంధించిన రూమర్స్ వినిపించాయి. ఆమె ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తని మ్యారేజ్‌ చేసుకోబోతుందన్నారు. రూమర్స్ చాలా వినిపిస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు తమన్నా స్పందించింది. తాను మ్యారేజ్‌ చేసుకోవడానికి ఇంకా రెండేళ్లు టైమ్‌ పడుతుందని తెలిపింది. ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంది. ప్రస్తుతానికి మ్యారేజ్‌ చేసుకునే ఆలోచన లేద`ని వెల్లడించింది. అయితే తమన్నాకి గతంలో మాదిరిగా ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. క్రమంగా తగ్గుతున్నాయనే టాక్‌ ఉంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి