Mahesh Babu Mother : మహేశ్ బాబు తల్లి మరణానికి ముందు ఇంత జరిగిందా.. ఫ్యామిలీ అంతా ఆమెకోసం?
Mahesh Babu Mother: సూపర్ స్టార్ మహేశ్ బాబు అమ్మగారు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.ఆమె మరణవార్త విని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మహేశ్ బాబు పిల్లలు కూడా నానమ్మ మీద ఉన్న ప్రేమను తమ కన్నీళ్ల రూపంలో తెలియజేశారు. సితార తండ్రి ఓడిలో కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంటే తన కూతురిని ఓదార్చేందుకు మహేశ్ ఎంతోగానో ప్రయత్నించారు.
Mahesh Babu Mother: ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్లీ..
మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది.దీంతో ఆమెను నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. దాదాపు నెల రోజుల పాటు ఆమె చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం కాస్త కుదుటపడింది ఇంటికి తీసుకెళ్లవచ్చని వైద్యులు చెప్పడంతో ఆమె ఇంటికి తీసుకొచ్చారు. ఏమైందో తెలియదు ఇంటికి తీసుకొచ్చాక మరోసారి ఆమె ఆరోగ్యం విషమించింది. వైద్యులు కూడా ఇక చేసేది ఏమిలేదని చేతులు ఎత్తేశారు. మూడు నుంచి నాలుగు రోజులు అనే సంకేతాలు ఇచ్చారు. దీంతో మహేశ్ కుటుంబం మొత్తం తన చివరి రోజుల్లో పక్కనే ఉండి దైర్యం చెప్పారట..
Lot of things In Ghattamaneni Family before Mahesh Babu Mother Indira Devi Incident
మహేశ్ బాబుకు తన తల్లి అంటే ఎంతో ఇష్టం. ఆమె చేతి కాఫీ తాగకుండా ఎప్పుడూ సినిమాలకు వెళ్లరని చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్స్ కూడా ఆమె కోసం క్యాన్సిల్ చేసుకుని తన తల్లికోసం ప్రార్థించాడట..కానీ దేవుడు కరుణించలేదు. సెప్టెంబర్ 28 ఉదయం ఇందిరాదేవి మరణించినట్టు వైద్యులు చెప్పడంతో అటు మహేశ్ బాబు, తన తండ్రి కృష్ణ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇదే నెలలో రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు మరణించడంతో ఇండస్ట్రీ దు:ఖ సాగరంలో మునిగిపోయింది.
