Home » Entertainment » Mahalaxmi Ravinder Trendy Couple Romantic Looks Adhurs
Entertainment

Mahalaxmi Ravinder : వారెవ్వా ట్రెండీ కపుల్.. మీ రొమాంటిక్ లుక్స్ అదుర్స్.. క్రిటిక్స్‌కు అదిరిపోయిన ఆన్సర్!

Authored By
mallesh
The Telugu News | Published on: September 14, 2022, 1:30 pm
Advertisement

Mahalaxmi Ravinder : ప్రేమ గుడ్డిది అని చాలా మంది అంటుంటారు. ఎందుకంటే ఎప్పుడు ఎవరి మీద ఎలా ప్రేమ పుడుతుందో ఎవరికీ తెలిదు. కులం, మతం, డబ్బు,పరపతి, లావు, సన్నగా ఇలా తేడాలను చూడనిదే ప్రేమ. అందుకే కొన్ని జంటలు చుట్టుపక్కల వారికి నవ్వు తెప్పిస్తుంటాయి. కానీ వారిద్దరూ కలిసి ఉండటానికి జీవితాంతం వారికి ప్రేమ దారి చూపుతుంది.అందుకే మనుషుల మధ్య తేడాలు అనేవి ప్రేమను విడదీయలేవని అంటుంటారు కొందరు. తాజాగా సోషల్ మీడియాలో ఒక కపుల్ వెడ్డింగ్ వైరల్ అవుతోంది.అది ఎవరిదంటే..

Advertisement

నిర్మాత రవీందర్, వీజే మహాలక్ష్మి. వీరిద్దరూ ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇది వీరిద్దరికి మొదటి లవ్..రెండో పెళ్లి అసలే కాదు. జీవితంలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాక వీరిద్దరి మనసులు కలిశాయి.అందరినీ ఎదురించి పెళ్లి చేసుకున్నారు. రవీందర్ చూడటానికి చాలా లావుగా కనిపిస్తాడు.ఇక మహాలక్ష్మి మాత్రం సన్నగా ఉంటుంది. అసలు వీరికి లవ్ ఎలా సెట్‌ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ పెళ్లి చేసుకుని అందరి నోర్లు మూయించారు. ఇప్పటికీ చాలా మంది ఈ జంటను చూసి కామెంట్స్ చేస్తున్నారు. అయినా.. వాటిని పట్టించుకోకుండా వీరు తమ పనిని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

Mahalaxmi Ravinder trendy couple romantic looks adhurs

Advertisement

Mahalaxmi Ravinder : ఈ కపుల్ నవ్వించినా.. స్వచ్ఛమైనది

దీంతో వీరి జంట ట్రెండీ కపుల్‌గా పిలువబడుతోంది. గత కొంతకాలంగా ఈ జంటపై జరుగుతున్న ప్రచారంపై తాజాగా నిర్మాత రవీందర్ స్పందించాడు.పుకార్లకు చెక్ పెడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహాలక్ష్మి నా ఆస్తి చూసి చేసుకుందని చాలా మంది అంటున్నారు. ఆమె నా మనసు చూసింది. నా ద్వారా పిల్లలు కానాలని కోరుకుంటుంది. మా ప్రేమకు గుర్తుగా పిల్లలను కోరుకుంటున్న ఆమె చాలా మంచి మనసున్న వ్యక్తి అని కౌంటర్ ఇచ్చాడు. తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనలో సగం ఉన్న అమ్మాయితో రవీందర్ స్టిల్స్ చూసి నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి