
#image_title
Mahalaxmi Ravinder : మీకు కోలీవుడ్ ప్రొడ్యూసర్ రవిందర్ చంద్రశేఖర్ తెలుసు కదా. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆయన గత కొన్నేళ్ల నుంచి తమిళనాడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. దానికి కారణం.. ఆయన పెళ్లి చేసుకున్న సీరియల్ నటి మహాలక్ష్మీ. ఆయన మాత్రం చాలా లావుగా ఉంటాడు. మహాలక్ష్మి మాత్రం కుందనపు బొమ్మలా ఉంటుంది. వీళ్లిద్దరికీ జోడి ఎలా కుదిరింది అనేది దేవుడికే తెలియాలి. ఇక అసలు విషయానికి వస్తే.. మూడు సినిమాలు తీసిన రవీందర్.. వాటి వల్ల బాగానే డబ్బులు సంపాదించాడు. అంతకుముందు ఆయన విషయంలో కొన్ని వివాదాలు నడిచేవి. కానీ.. అవి పెద్దగా రవీందర్ ను హైలైట్ చేయలేదు కానీ.. ఎప్పుడైతే రవీందర్ మహాలక్ష్మీని పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుంచి సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది. రవీందర్ కు, మహాలక్ష్మీకి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. అయినా కూడా మహాలక్ష్మీ.. రవీందర్ ను ఎలా పెళ్లి చేసుకుంది అనేది అంతుపట్టడం లేదు.
#image_title
అయితే.. మహాలక్ష్మీని పెళ్లి చేసుకోవడం రవీందర్ అదృష్టం అనే చెప్పుకోవాలి. తన ఊ అంటూ వందల మంది స్మార్ట్ గా ఉన్న నటులు తన ముందు లైన్ కడతారు. కానీ.. మహాలక్ష్మీ మాత్రం డ్రమ్ములా ఉన్న రవీందర్ ను పెళ్లి చేసుకుంది. అయితే.. రవీందర్ సినిమాలు ప్రొడ్యూస్ చేసి బాగా డబ్బులు సంపాదించడంతో మహాలక్ష్మి కన్ను రవీందర్ మీద పడింది. బాడీదేముంది భరిస్తా అని అనుకుందో ఏమో.. రవీందర్ ను పెళ్లి చేసుకుంది మహాలక్ష్మి. నిజానికి మహాలక్ష్మీకి ఇది రెండో పెళ్లి. అప్పటికే తనకు పెళ్లి అయి ఒక కొడుకు కూడా ఉన్నాడు. కానీ.. తన భర్తతో విడాకులు తీసుకుంది మహాలక్ష్మీ. ఆ తర్వాత రవీందర్ కూడా మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. అలా ఇద్దరి మద్య బంధం బలపడింది అన్నమాట.
అయితే.. ఓరోజు సడెన్ గా ఈ బ్యూటీతో రవీందర్ పెళ్లి కావడంతో తమిళనాడు ఇండస్ట్రీ షాక్ నకు గురయింది. తెలుగు ఇండస్ట్రీ కూడా షాక్ అయిందనే చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో వీళ్ల పెళ్లి ఫోటోలు చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ బ్యూటీ ఎక్కడ.. ఈ ఫ్యాటీ ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వైరల్ కావడంతో మా మనసులు ముడిపడ్డాయి. ఇక శరీరంతో అవసరం ఏముంది అని సోషల్ మీడియా నెటిజన్లకు షాకిచ్చింది.
అసలు మహాలక్ష్మీ రవీందర్ ను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని కామెంట్లు చేశారు. ఆమె కావాలంటే చాలామంది తనను పెళ్లి చేసుకునేవారు. కానీ.. తనే కావాలని తన అందంతో అందరినీ రెచ్చగొట్టింది. ట్రాప్ చేసింది అంటున్నారు. ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా రవీందర్, మహాలక్ష్మీ అస్సలు పట్టించుకోలేదు. మాకు మేము నచ్చాం.. పెళ్లి చేసుకున్నాం. మీరు ఎంత ట్రోల్ చేసినా మేము పట్టించుకోం అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.
పెళ్లి తర్వాత రవీందర్, మహాలక్ష్మీ ఇద్దరూ కలిసి హనీమూన్, ట్రిప్ ఎటు వెళ్లినా ఇద్దరూ కలిసి ఫోటోలు షేర్ చేసేవారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మహాలక్ష్మీ ఒక్కతే ఫోటోలు పెట్టడం ప్రారంభించింది. మహాలక్ష్మీ ఒంటరిగా ఉన్న ఫోటోలు పెడుతోంది అంటే వీళ్లు పెళ్లి కంటే ముందే విడాకుల డేట్ ఫిక్స్ అయింది అంటూ ట్రోల్ చేశారు. కానీ.. ఇద్దరూ కలిసి మళ్లీ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో వైరల్ చేయడం ప్రారంభించారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు పెట్టడంతో పాటు రవీందర్ కాస్త మసాలా యాడ్ చేసి చూడు బంగారం.. నువ్వు ఇంకోసారి నీ అంతట నువ్వు నీ ఫోటోలు మాత్రమే పెట్టకు. మన ఇద్దరి ఫోటోలు ఉంటేనే సోషల్ మీడియాలో పెట్టు. లేదంటే మనకు బలవంతంగా విడాకులు ఇప్పిస్తారు అని సెటైర్లు వేశారు రవీందర్.
దీంతో ఇదే మాట మీద నిలబడాలి.. నీ విడాకుల పోస్ట్ పెట్టినప్పుడు నీకు ఉంటుంది మటన్ బిర్యానీ అంటూ మరో విధంగా ట్రోల్ చేశారు. అయితే దేవుడు తథాస్తు ఏమన్నాడో ఏమో కానీ.. సడెన్ గా నిర్మాత రవీందర్ అరెస్ట్ అయ్యాడు. 16 కోట్ల మేర ఓ అమాయక వ్యాపారవేత్తకు టోపీ పెట్టాడని సీఐడీ జైలులో పెట్టింది. ప్రస్తుతం రవీందర్ జైలులో ఉన్నాడు.
ఈయన అరెస్ట్ వెనుక మహాలక్ష్మీనే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మహాలక్ష్మీ అందంగా మనోడిని ట్రాప్ చేసి గ్లామర్ కరువుతో ఉన్న రవీందర్ తనకు పడిపోవడంతో అతడిని చివరకు జైలుకు పంపించి తన ఆస్తి మెత్తం ఎంజాయ్ చేస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
This website uses cookies.