AP Cabinet Meeting : స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. విపక్షాలకు మైండ్ బ్లాక్..!
AP Cabinet Meeting : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశంపై…
AP Cabinet Meeting : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో రిజర్వేషన్ల అమలుపై ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ భేటీలో బీసీ రిజర్వేషన్ల అమలుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
AP Cabinet Meeting : స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. విపక్షాలకు మైండ్ బ్లాక్..!
AP Cabinet Meeting బీసీ రిజర్వేషన్లపై నేడు కేబినెట్ కీలక నిర్ణయం?
స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని బీసీ డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫారసుల ఆధారంగా ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే శనివారం రాష్ట్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో 50 శాతం రిజర్వేషన్ల అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కేబినెట్ నిర్ణయం వెలువడిన వెంటనే పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు విడివిడిగా రిజర్వేషన్లకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ ఉత్తర్వులు వెలువడితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముందుకు సాగేందుకు మార్గం సుగమమవుతుంది.ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రిజర్వేషన్ల కేటాయింపు చేపట్టాల్సి ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు ఆయా వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. అదే విధంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు, గ్రామ పంచాయతీలు, పంచాయతీ వార్డులకు కూడా రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
AP Cabinet Meeting స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడంటే?
రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల 12వ తేదీన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గతంలో మున్సిపల్ ఎన్నికలతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఒకే దశలో నిర్వహించగా, గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో చేపట్టారు. అయితే ఈసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించాలని కోరుతూ అభ్యర్థనలు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం, ఎన్నికల యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇక ఈ నెల 16న ‘సర్’ ప్రక్రియ ముగియనుంది. తుది ఓటర్ల జాబితా విడుదల కావడానికి మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై తుది నిర్ణయం తీసుకుంటే, ఆ తర్వాత రెండు నుంచి మూడు రోజుల్లోనే రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల కమిషనర్లు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే నేడు జరగనున్న మంత్రివర్గ సమావేశం ఏపీ స్థానిక ఎన్నికల తదుపరి కార్యాచరణకు కీలకంగా మారింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, ఆ తర్వాత వెలువడే ఉత్తర్వులు, ఎన్నికల సంఘం ప్రకటించే షెడ్యూల్‌పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.







