Home » Entertainment » Mahesh Babu Fans Who Targeted Rajamouli In Heroine Matter
Entertainment

Mahesh Babu : రాజమౌళిని టార్గెట్ చేసిన మహేశ్ బాబు ఫ్యాన్స్.. ఆ హీరోయిన్ వద్దే వద్దంటూ ఒకటే గొడవ!

Authored By
mallesh
The Telugu News | Published on: September 18, 2022, 10:30 am
Advertisement

Mahesh Babu : దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా తీయనున్నట్టు ప్రకటించినప్పటి నుంచి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ అభిమాన హీరోతో రాజమౌళి సినిమా ఎప్పుడు ప్రారంభిస్తాడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారట..అయితే, మహేశ్‌తో తీసే సినిమా సాధారణంగా ఉండబోదని వరల్డ్ క్లాస్ లెవల్ ఉంటుందని చెప్పడంతో మరోసారి భారీ బడ్జెట్ ఎత్తుకోనున్నట్టు చెప్పకనే చెప్పాడు జక్కన్న..ఏదేమైనా మహేశ్ గ్లామర్‌కు తగ్గ హీరోయిన్ ఉండాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Mahesh Babu : ఎస్‌ఎస్ రాజమౌళి నీకు ఏమైనా బుద్ది ఉందా..

మహేశ్ బాబు టాలీవుడ్‌ను వదిలి ఎన్నడూ బాలీవుడ్ , హాలీవుడ్ జోలికి వెళ్లనని ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశాడు. అవసరమైతే తెలుగులోనే బాలీవుడ్ రేంజ్ సినిమాలు చేస్తానని చెప్పాడు. అనుకున్నట్టే రాజమౌళితో జతకడుతున్నాడు ప్రిన్స్..ఈ సినిమాకు గ్రాఫిక్స్‌తో పాటు ప్రపంచంలోని చాలా ప్రదేశాల్లో షూటింగ్ జరపనున్నారట.. ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్‌తో ఎస్‌ఎస్ ఎంబీ -28 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు.

Mahesh Babu fans who targeted Rajamouli In Heroine Matter

Advertisement

ఈ సినిమాను 6 నెలల్లో పూర్తిచేసి జనవరి వరకు రాజమౌళితో సినిమా చేసేందుకు ప్రిపేర్‌గా ఉండనున్నాడు మహేశ్.. దానికి అనుగుణంగానే మహేష్ షెడ్యూల్స్ ప్లాన్ చేశాడట..ఇదిలాఉండగా సోషల్ మీడియాలో ప్రిన్స్ , జక్కన్న సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది. మహేశ్‌కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనేను ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది.

ఈ పొడుగు కాళ్ల సుందరి ప్రస్తుతం ప్రభాస్‌తో ప్రాజెక్-కే సినిమా చేస్తోంది.దీనికి మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్టర్. ఈ సినిమాను బడా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్నాడు.అయితే, మహేశ్ బాబు సరసన దీపిక అని టాక్ రావడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారట.. దీపికా చూసేందుకు బాగున్నా ప్రిన్స్ పక్కన బాగోదని.. మావోడి అందానికి తగ్గ హీరోయిన్‌ను ఎంపిక చేయాలని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారట..అంతేకాకుండా ఆమెను ఎలా సెలెక్ట్ చేస్తావంటూ జక్కన్నను నీకు ఏమైనా బుద్ది ఉందా? అంటూ ఫైర్ అవుతున్నారట..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి