Mahesh Babu : చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న చిత్రం ఆచార్య. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలకానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఆచార్య టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. ఏప్రిల్ 23న ఆరు గంటలకు హైదరాబాద్‌లోని యూసఫ్ గూడలో నిర్వహించనుందని టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది టీమ్. ఈ కార్యక్రమానికి దిగ్గజ దర్శకడు రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా రానున్నారట. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా చీఫ్ గెస్ట్‌గా వస్తారని టాక్ నడుస్తుంది. మరోవైపు సినిమా నుండి సాంగ్స్ కూడా విడుదల చేస్తున్నారు.
రీసెంట్‌గా భలే భలే బంజారా సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయగా.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. శంకర్ మహాదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. చిరంజీవి, రామ్ చరణ్‌లు ఇద్దరూ ఈ పాటలో కలిసి డాన్స్ ఇరగదీశారని తెలుస్తోంది. ఇక ప్రమోషన్‌లో భాగంగా ఏప్రిల్ 12న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అయితే, ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించారు.
ఈ విషయాన్ని తాజాగా మెగాస్టార్ స్వయంగా కన్ఫర్మ్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. “మా ‘ఆచార్య’ సినిమాలో ‘పాద ఘట్టాన్ని’ మహేష్ తన గొంతుతో మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది”.. అని తెలిపారు. ఈ సినిమాకు మహేష్ తన వంతుగా ప్రత్యేక పాత్ర పోషించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని.. అలాగే, అభిమానులు, ప్రేక్షకులు కూడా నేను – రామ్ చరణ్ ఎంతైతే థ్రిల్ అయ్యామో అదే విధంగా వారు కూడా థ్రిల్ ఫీలవుతారని మెగాస్టార్.. మహేష్ వాయిస్ ఓవర్‌పై ఈ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఆచార్య చిత్ర దర్శకుడు కొరటాల శివ కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబు అడగగానే వాయిస్ చెప్పేందుకు ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పుకున్నారని చెప్పుకొచ్చాడు.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.