Mahesh Babu : చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌కు మహేష్ బాబుసాయం… ఆనంద‌ప‌డుతున్న ఇరు హీరోల అభిమానులు

Authored By Sam C | The Telugu News | Published on: April 22, 2022, 3:30 pm

Mahesh Babu : చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న చిత్రం ఆచార్య‌. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలకానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఆచార్య టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. ఏప్రిల్ 23న ఆరు గంటలకు హైదరాబాద్‌లోని యూసఫ్ గూడలో నిర్వహించనుందని టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది టీమ్. ఈ కార్యక్రమానికి దిగ్గజ దర్శకడు రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా రానున్నారట. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా చీఫ్ గెస్ట్‌గా వ‌స్తార‌ని టాక్ న‌డుస్తుంది. మ‌రోవైపు సినిమా నుండి సాంగ్స్ కూడా విడుద‌ల చేస్తున్నారు.

రీసెంట్‌గా భలే భలే బంజారా సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయగా.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. శంకర్ మహాదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. చిరంజీవి, రామ్ చరణ్‌లు ఇద్దరూ ఈ పాటలో కలిసి డాన్స్ ఇరగదీశారని తెలుస్తోంది. ఇక ప్రమోషన్‌లో భాగంగా ఏప్రిల్ 12న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అయితే, ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించారు.

mahesh babu helps to chiranjeevi

mahesh babu helps to chiranjeevi Ram Charan

Mahesh Babu : మ‌హేష్ చిరు సాయం..

ఈ విషయాన్ని తాజాగా మెగాస్టార్ స్వయంగా కన్ఫర్మ్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. “మా ‘ఆచార్య’ సినిమాలో ‘పాద ఘట్టాన్ని’ మహేష్ తన గొంతుతో మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది”.. అని తెలిపారు. ఈ సినిమాకు మహేష్ తన వంతుగా ప్రత్యేక పాత్ర పోషించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని.. అలాగే, అభిమానులు, ప్రేక్షకులు కూడా నేను – రామ్ చరణ్ ఎంతైతే థ్రిల్ అయ్యామో అదే విధంగా వారు కూడా థ్రిల్ ఫీలవుతారని మెగాస్టార్.. మహేష్ వాయిస్ ఓవర్‌పై ఈ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఆచార్య చిత్ర దర్శకుడు కొరటాల శివ కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబు అడగగానే వాయిస్ చెప్పేందుకు ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పుకున్నారని చెప్పుకొచ్చాడు.

Sam C

No bio available for this author.

  1. "Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి హనోయ్ వెకేషన్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోలు!"

  2. "Avinash Reddy : వేల కొద్దీ డాక్యుమెంట్లతో ఈడీ ముందుకొచ్చిన అవినాష్ రెడ్డి.. తాడేపల్లిలో మొదలైన టెన్షన్..!"

  3. "Ranabaali Movie First Review : రణబాలి మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ..!"

  4. "Vijayasai Reddy : వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంపై రచ్చ.. వైసీపీ, టీడీపీ మౌనంపై విజయసాయిరెడ్డి సంచలన ఫైర్..!"

  5. "Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్ ‘ఓటు చోరీ’ సభలో రాహుల్ గాంధీ బిగ్ మిస్టేక్.. పార్టీకి సెల్ఫ్ గోల్ తప్పదా..?"

  6. "Ysrcp : కాకినాడ మేయర్ రేసులో ముద్రగడ క్రాంతి.. కూటమికి చెక్ పెట్టేందుకు వైసీపీ బిగ్ స్కెచ్ ..?"

  7. "Khairatabad By Election : ఖైరతాబాద్ ఉప ఎన్నిక సర్వే.. ఏ పార్టీ లీడ్ లో ఉందంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp