
mahesh babu stunning comments on Namratha
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12న విడుదల కానుండగా, ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మహేష్ బాబు కెరీర్ లో కరోనా కారణంగా వెండితెరకు చాలా ఎక్కువ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడెప్పుడో ఖలేజా సినిమా కారణంగా దాదాపు ఏడాదిన్నర సినిమా రిలీజ్ లేకుండా ఉన్న మహేష్ మళ్ళీ ఆ తరువాత ఆ గ్యాప్ రానివ్వకుండా చూసుకున్నప్పటికి కరోనా వలన రెండేళ్లు వెండితెరకు దూరమయ్యారు. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాతో అలరించబోతున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమా చేయనున్నాడు.
మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు మహేష్ బాబు మొదటి సారి అఫిషియల్ గా స్పందించాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్.రాధాకృష్ణ నిర్మించే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ లోనే మొదలు కాబోతున్న ట్లుగా కూడా మహేష్ బాబు ఇటీవల లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. ఇక భవిష్యత్తులో మహేష్ బాబు రాజమౌళితో కూడా మరో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్న మహేష్ బాబు నమ్రత గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.
mahesh babu stunning comments on Namratha
నమ్రతతో ఏమైన గాసిప్స్ డిస్కస్ చేస్తారా అని సుమ అడగగా, దానికి స్పందించిన మహేష్.. ఆమె ఫ్రెండ్స్ తో మాట్లాడే గాసిప్స్‌కి చెవులు మూసుకుంటాను అని అన్నాడు. దీంతో నవ్వులు విరిసాయి. కాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యవహారాలన్నీ కూడా నమ్రతే చూసుకుంటుందని అందరికీ తెలిసిందే. మహేష్ బాబు సినిమాల్లో నటిస్తుంటాడు. కానీ ఆ సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు, ప్రకటనలకు సంబంధిన విషయాలను చూసుకుంటూ ఉంటుంది. నమ్రత గురించి మహేష్ బాబు .. బాలయ్య షోలో చెప్పుకొచ్చాడు. తాను ఇంట్లో చేసే పనుల గురించి, పిల్లల బాధ్యతల గురించి మహేష్ బాబు నోరు విప్పాడు.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.