
Majula Paritala Open COmments On Acting With Karthika Deepam Nirupam
బుల్లితెరపై మంజుల, నిరుపమ్‌ది హిట్ జోడి. చంద్రముఖి సీరియల్‌తోనే వీరి పరిచయం, ప్రయాణం మొదలైంది. ఆ సీరియల్ టైంలోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ కూడా పుట్టింది. ఆ ప్రేమ ప్రయాణం కాస్త పెళ్లి వరకు వెళ్లింది.కానీ సెట్‌లో ఎవ్వరికీ తెలియకుండా మ్యానేజ్ చేశారట. వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడంతో సెట్‌లో అందరూ షాక్ అయ్యారట. అలా ఎంతో సీక్రెట్‌గా ఇద్దరూ ప్రేమించుకున్నారట. ఇక ఫోన్ బిల్లుల మోత మోగిపోయేవట. అప్పుట్లో ల్యాండ్ లైన్స్ మాత్రమే ఉండేవన్న సంగతి తెలిసిందే. మొత్తానికి మంజుల, నిరుపమ్ మాత్రం ఒక్కటయ్యారు. పెళ్లి తరువాత మంజులకు ఆఫర్లు కాస్త తగ్గాయి. నిరుపమ్ క్రేజ్ మాత్రం పెరుగుతూ వచ్చింది.
బుల్లితెరపై స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్నాడు. బుల్లితెర శోభన్ బాబు అంటూ కార్తీక దీపం సీరియల్‌తో నిరుపమ్ డిమాండ్ ఫుల్లుగా పెరిగింది. ఇక ఇప్పుడు నిరుపమ్, మంజుల ఇద్దరూ కూడా యూట్యూబ్ ద్వారా మరింత దగ్గరువుతున్నారు. అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఓ వీడియోను వదిలారు. అందులో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఎక్కువ మంది కొన్ని ప్రశ్నలను రిపిటెడ్‌గా అడిగారట. అందులో తామిద్దరం కలిసి ఎప్పుడు నటిస్తామని, కలిసి సీరియల్ ఎప్పుడు చేస్తామని అడుగుతున్నారట. అయితే దీనికి నిరుపమ్ ఏదో చెప్పబోయాడు.
Majula Paritala Open COmments On Acting With Karthika Deepam Nirupam
మంజుల మాత్రం బీ ప్రాక్టికల్.. నేను ఇలా చెబుతున్నాను అని ఎవ్వరూ ఏమనుకోవద్దంటూ తన వర్షన్ చెప్పుకొచ్చింది. తన వయసు ఇప్పుడు 36 అంటూ.. ఈ వయసులో నాకు హీరోయిన్ పాత్రలు ఇవ్వరు.. అలా అని నిరుపమ్ ఇప్పుడు వేరే పాత్రలు చేయలేడు.. కేవలం హీరోగానే చేస్తాడు.. అందుకే మేం ఇద్దరం కలిసి నటించలేం.. అది నాకు తెలుసు.. కాకపోతే నాకు ఏవో చిన్న పాత్రలు వస్తే చేస్తాను.. అని మంజుల చెప్పేసింది. అయితే సీరియల్స్‌లో అది కుదరకపోయినా.. బయట వేరే ఏదైనా,వెబ్ సిరీస్ అయినా మేం చేస్తాం.. మాకు కథ నచ్చితే కలిసి నటిస్తామని నిరుపమ్ అన్నాడు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.