Home » Entertainment » Malla Reddy Villain Role In Pawan Kalyan Ustaad Bhagat Singh
Entertainment

Minister Malla Reddy : పవన్ కళ్యాణ్ పక్కన విలన్ గా చేయాలని హరీష్ శంకర్ గంటసేపు బతిమిలాడాడు.. మల్లారెడ్డి కామెంట్స్

Authored By
Breaking News 2
The Telugu News | Published on: March 27, 2023, 9:00 am
Advertisement

Minister Malla Reddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి గురించి తెలుసు కదా. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పాలు అమ్మి, పూలు అమ్మి మరీ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారు. చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు. చివరకు ఇప్పుడు ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ గా ఎదిగారు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన మల్లారెడ్డి తనకు సినిమాలపై ఉన్న ఆసక్తి గురించి చెప్పుకొచ్చారు.

Advertisement

Malla Reddy Villain Role In Pawan Kalyan Ustaad Bhagat Singh

మల్లారెడ్డికి అప్పట్లో సినిమా అవకాశాలు చాలా వచ్చాయట. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో చాన్స్ వచ్చిందట. ఆ సినిమాలో విలన్ రోల్ చేయాలంటూ మంత్రి మల్లారెడ్డిని డైరెక్టర్ హరీష్ శంకర్ గంటసేపు బతిమిలాడారట. కానీ.. మల్లారెడ్డి మాత్రం తాను చేయనని చెప్పారట. కాకపోతే ఈ ఎన్నికలు పూర్తయ్యాక నాలుగు సినిమాలు తీస్తా అంటూ చెప్పుకొచ్చారు మల్లారెడ్డి.

Advertisement

Minister Malla Reddy : పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారా?

త్వరలో రాబోయే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మల్లారెడ్డికి ఏదైనా క్యారెక్టర్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యాక.. నాలుగైదు సినిమాలు కంటిన్యూగా తీస్తాను. అవి కూడా మన తెలంగాణ మోడల్.. తెలంగాణను మనం చూపించుకోవాలి. మన సినిమాలు అన్నీ ఫేమస్ అయితయి. ఇప్పటి వరకు ఎవరూ ధైర్యం చేయలేదు. ఇప్పటి నుంచి ధైర్యం చేయండి. గ్యారెంటీగా మన తెలంగాణ సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయి అని చెప్పుకొచ్చారు.

Advertisement

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి