Home » Entertainment » Mallemala Tv Tribute To Uday Kiran In Rakhi Special Event
Entertainment

Uday Kiran : ఉదయ్ కిరణ్‌కు నివాళి.. ఏడిపించిన మల్లెమాల టీం

Authored By
aruna
The Telugu News | Updated on: August 6, 2022 5:13 pm
Advertisement

Uday Kiran : మల్లె మాల టీం మీద అప్పుడప్పుడు కోపం చిరాకు వేసినా.. కొన్ని సందర్భాల్లో మాత్రం మెచ్చుకోవాలనిపిస్తుంది. మల్లెమాల టీం కొత్తగా ఆలోచిస్తుంటుంది. భిన్న దారిలో నడుస్తుంది. ఆ ఆలోచనల్లోంచే.. ఢీ, జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటివి పుట్టుకొచ్చాయి. ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీ టాప్ ప్లేస్‌లోకి వెళ్తోంది. ఇక పండుగలకు చేసే స్పెషల్ ఈవెంట్లు సైతం ఆకట్టుకునేలా ఉంటాయి. తాజాగా రాఖీ స్పెషల్ ఈవెంట్ ప్రోమోలు ట్రెండ్ అవుతున్నారు. అందులో మరీ ముఖ్యంగా ఉదయ్ కిరణ్‌కు నివాళి ఇచ్చిన ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. ఉదయ్ కిరణ్‌కు ఇలా బుల్లితెరపై నివాళి ఇవ్వడం అందరినీ ఎమోషనల్‌గా టచ్ చేస్తోంది. ఉదయ్ కిరణ్ ఎంట్రీ, అనతి కాలంలోనే అంత ఎత్తుకు ఎదగడం, ఎవ్వరూ ఊహించనిస్థితిలో ఆత్మహత్య చేసుకోవడం అందరినీ ఇంకా గుర్తుండే ఉంటుంది.

Advertisement

ఉదయ్ కిరణ్ మృతికి తీసిన కారణాలపై ఎన్నెన్నో రూమర్లున్నాయి. అయితే ఇప్పుడు ఉదయ్ కిరణ్ ప్రయాణం మీద ఓ పర్ఫామెన్స్ చేశారు. ఎలా వచ్చాడు.. ఎలా ఎదిగాడు.. మధ్యలో ఎదురైన ఎత్తుపల్లాలు.. చివర్లో ముగించిన ప్రయాణం మీద డ్యాన్స్ పర్ఫామెన్స్ చేశారు. చిత్రం సినిమాతో వచ్చి వరుసగా హిట్లు ఇవ్వడంతో స్టార్ అయిపోయాడు. ఇక మధ్యలో తన తల్లి చనిపోవడం, ఆఫర్లు రాకపోవడంతో ఒత్తిడికి గురవ్వడం.. చివరకు ఆత్మహత్య చేసుకోవడం వంటి వాటిపై పర్ఫామెన్స్ చేసి అందరినీ ఏడిపించేశారు. ఇక మనసంతా నువ్వే సినిమాలో ఉదయ్ కిరణ్ చెల్లిగా నటించిన వ్యక్తి నాటి సంగతులు చెబుతూ కంటతడి పెట్టేసుకుంది.

Mallemala TV Tribute To Uday Kiran in Rakhi Special event

Advertisement

ఉదయ్ కిరణ్ గారు.. మొదటి రోజు సెట్‌లో తనతో ఇలా అన్నాడంటూ చెబుతూ ఏడిపించేసింది. మీ అన్నయ్యతో ఎలా ఉంటావో నాతో కూడా అలానే ఉండు.. అలానే మాట్లాడు అని చెప్పాడట. అంతటి ఉదయ్ కిరణ్‌ను ఈరోజు ఇలా గుర్తు చేసినందుకు, నివాళిగా వేసినందుకు జనాలు మల్లెమాలను పొగుడుతున్నారు. ఇలా ఉదయ్ కిరణ్ మరోసారి చర్చల్లోకి వచ్చాడు. యూట్యూబ్ వీడియో కింద మొత్తం ఉదయ్ కిరణ్ గురించి స్పందిస్తున్నారు. మరోసారి ఇలా అందరి ఆలోచనల్లోకి వచ్చేశాడు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి