Home » Entertainment » Manchu Family Son Of India Movie Digital Streaming In Prime Video
Entertainment

Manchu Family : మంచు ఫ్యామిలీ వారు మళ్లీ పరువు పోగొట్టుకోకుండా జాగ్రత్త పడ్డారు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: May 19, 2022 12:48 am
Advertisement

Manchu Family : మంచు ఫ్యామిలీని కొందరు సోషల్‌ మీడియాలో టార్గెట్‌ చేస్తున్న విధానం చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. ఒకప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో ఏమాత్రం తగ్గకుండా సమానమైన స్టార్‌ డమ్‌ ను కలిగి ఉన్న మోహన్‌ బాబు ను మరియు ఆయన ఫ్యామిలీని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. మోహన్ బాబు సినిమాల్లో కాస్త తగ్గిపోయాడు. కొడుకులు సినిమాలు ఎక్కువగా చేయడం లేదు. అయినా కూడా మంచు ఫ్యామిలీ సోషల్‌ మీడియాలో ట్రోల్స్ కు బలి అవుతుందంటే కారణం వారు మాట్లాడే మాటలు.. వారు పదే పదే సొంత డబ్బు కొట్టుకుంటూ పాత విషయాలను చెప్పుకోవడమే అనేది కొందరి అభిప్రాయం.

Advertisement

ఇక మోహన్‌ బాబు సన్నాఫ్ ఇండియా సినిమా తో ఏ స్థాయిలో దిగజారి పోయాడో అందరికి తెల్సిందే. పాతిక కోట్ల మూవీ కనీసం కోటి వసూళ్లను రాబట్టలేక మొదటి రోజే రెండవ షో నుండి థియేటర్లు మూత పడ్డాయి అనే వార్తలు వచ్చాయి. మంచు మోహన్‌ బాబు ఆ అవమానంతో మళ్లీ సినిమాలు చేయాలంటేనే అవసరమా అన్నట్లుగా కంగారు పడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సన్నాఫ్ ఇండియా సినిమా నుండి మెల్ల మెల్లగా మంచు వారు బయట పడుతున్నారు. ఈ సమయంలో సన్నాఫ్ ఇండియా సినిమాను ప్రైమ్ వీడియో వారు స్ట్రీమింగ్‌ మొదలు పెట్టారు.

Manchu Family son of india movie digital streaming in prime video

Advertisement

మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా సినిమా ప్రైమ్ లో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయంను పెద్దగా ప్రచారం చేయలేదు. విష్ణు కాని ఇతర మంచు ఫ్యామిలీ కాని సన్నాఫ్ ఇండియా సినిమా స్ట్రీమింగ్‌ విషయాన్ని వెళ్లడించలేదు. వారు ఏ చిన్న ట్వీట్‌ చేసినా.. ఏ ప్రచారం చేసినా కూడా సన్నాఫ్ ఇండియా సినిమాకు నష్టమే తప్ప లాభం లేదు అనేది విశ్లేషకుల అభిప్రాయం. సన్నాఫ్ ఇండియా గురించి మళ్లీ మీడియా ముందుకు వచ్చి పరువు పోగొట్టుకోవడం తప్ప మరేం లేదు. అందుకే పరువు పోకుండా సన్నాఫ్ ఇండియాను పూర్తిగా వదిలేసి ముందస్తు జాగ్రత్త పడ్డారంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. మంచు వారు పట్టించుకోకున్నా కూడా సన్నాఫ్‌ ఇండియా ట్రోల్స్ ఆగడం లేదు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి