Drushyam : దృశ్యం సినిమా అటు మలయాళంలో ఇటు తెలుగులో మంచి కమర్షియల్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ – మీనా జంటగా నటించగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. సింపుల్ కథ ని మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించి ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇదే సినిమాని దృశ్యం పేరుతోనే తెలుగులో రీమేక్ చేశారు. వెంకటేష్ – మీనా జంటగా నటించారు. తెలుగు వెర్షన్ కి శ్రీప్రియ దర్శకత్వం వహించారు.
meena-is-minus-for-drushyam-movie-top-secret-revealed-by-the-director
ఇటు తెలుగులో అటు మలయాళంలో భారీ సక్సస్ అందుకుంది దృశ్యం. కానీ నెటిజన్స్ మాత్రం ఒక్క విషయంలో దర్శకుడిని .. హీరోయిన్ గా నటించిన మీనా ని విపరీతంగా ట్రోల్స్ అండ్ కామెంట్ చేశారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2013 లో మలయాళంలో 2014 లో తెలుగులోనూ వచ్చిన ఈ సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎదుర్కొనే సమస్యల నేపథ్యంలో తెరకెక్కించారు. కథ.. కథనం ప్రకారం పాత్రలన్నీ ఎంతో సహజంగా కనిపించాలి. వీలైనంతవరకు నేచురల్ గా కనిపించాలి.
మధ్య తరగతి యువతిగా నటించిన మీనా మేకప్ లేకుండా కనిపించాల్సింది. కాని మీనా అలా చేయలేదు. సినిమా మొదటి నుంచి చివరి వరకు క్లాస్ గా ఫుల్ మేకప్ లోనే కనిపించింది. కథ కి తగ్గట్టు మేకప్ లేకుండా కనిపించాలని దర్శకుడు జీతూ జోసెఫ్ చెప్పినా కూడా మీనా ససేమిరా అన్నదట. మేకప్ లేకుండా నటించమంటే కుదరదని తేల్చి చెప్పిందట. దాంతో అందరూ దర్శకుడిని తప్పు పడుతూ కామెంట్ చేశారు. దాంతో దర్శకుడు క్లారిటీ ఇస్తూ నేను చెప్పినప్పటికి మీనా వినలేదని … తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే అలానే చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు రాబోతున్న దృశ్యం 2 లో మీనా ఎలా కనిపించబోతుందో చూడాలి.
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
This website uses cookies.