Mega Family : మెగా ఫ్యామిలీ లో జరిగే బ్యాడ్ పనులకు కారణం ఆ ఇల్లే ..!
Mega Family : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఉన్నవి లేనట్లుగా చూపించడం లేనివి ఉన్నట్లుగా చూపించడం చాలా కామన్ గా మారిపోయింది. మరి ముఖ్యంగా ఇటీవల మెగా ఫ్యామిలీ లో వార్తలు ఎక్కువగా చూస్తున్నాం. రీసెంట్ గా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీలో చోటు చేసుకుంటున్న బ్యాడ్ సెంటిమెంట్స్ కి ఆ ఇల్లే కారణం అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. మకుటం లేని మహారాజుగా ఇండస్ట్రీని ఏలేస్తున్న చిరంజీవి గత కొంతకాలంగా సోషల్ మీడియా లో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతున్నారు.
అంతేకాదు ఆయన తీసిన సినిమాలు కూడా జనాలను మెప్పించలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే చిరంజీవిని ఇక సినిమాలు ఆపేయమంటూ కూడా సొంత ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే దీనంతటికీ కారణం చిరంజీవి టైం బాగోలేకపోవడమే అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. నిజానికి మొగలితూరులో చిరంజీవి ఉన్న ఇల్లుని అప్పట్లో లైబ్రరీకి ఇవ్వకుండా మెగాస్టార్ కేవలం 3 లక్షలకు అమ్మేశారట. అయితే అక్కడ లైబ్రరీ కట్టడానికి చాలామంది ట్రై చేశారట.చిరంజీవి ప్రజల గురించి ఆలోచిస్తారని ఆయన ఇల్లుని ఇవ్వమని అడగగా ఇవ్వను అని తేల్చి చెప్పేశారట. అప్పట్లో ఈ వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. అయితే అసలు విషయం ఏంటంటే ఆ ఇల్లు చిరంజీవిది కాదు ఆయన మేనమామది.
ఆ ఇంటితో చిరంజీవికి ఎటువంటి హక్కు లేదు. కావాలనే కొందరు చిరంజీవిని ఈ మేటర్ లోకి ఇన్వాల్వ్ చేసి ఇరికించారు. ఇన్నాళ్ల తర్వాత అదే విషయాన్ని మళ్ళీ ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు చిరంజీవి ఇంట్లో వరుసగా బ్యాడ్ విషయాలు జరగడానికి కారణం ఆ ఇల్లే కారణం అని లైబ్రరీకి ఇల్లు ఇవ్వకపోవడం వల్లనే మెగా ఫ్యామిలీ ఇబ్బందులు పడుతుందని అంటున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు.