Home » Entertainment » Mega Fans Fire On Kajal Aggarwal
Entertainment

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్‌పై కోపంగా ఉన్న మెగా ఫ్యాన్స్ ఎందుకో తెలుసా?

Authored By
Sam C
The Telugu News | Published on: April 22, 2022, 2:30 pm
Advertisement

Kajal Aggarwal : టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవ‌ల త‌ల్లి ప్రమోష‌న్ అందుకున్న విష‌యం తెలిసిందే. జ‌న‌వ‌రిలో తాను ప్రెగ్నెంట్ అని ప్ర‌క‌టించిన కాజ‌ల్ అక్క‌డి నుండి తెగ ఫొటో షూట్స్ చేస్తుంది. బేబి బంప్ తో కాజ‌ల్ చేసిన ఫొటో షూట్స్‌తో ఆమె ఇన్‌స్టాగ్రామ్ నిండిపోయింది. తొలి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ మాతృత్వపు ఆనందాన్ని పొందుతోంది. తన బిడ్డకు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో భావోద్వేగమైన పోస్ట్ పెట్టింది. తన బిడ్డ నీల్ ను ప్రపంచంలోకి ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని కాజల్ తెలిపింది. తొలిసారి నీల్ తన ఛాతీపై పడుకున్నప్పుడు ప్రేమకు సంబంధించి ఎంతో లోతైన భావనను పొందానని తెలిపింది.

Advertisement

ఒక బిడ్డకు జన్మనివ్వడం అంత సులువైన విషయం కాదని… మూడు రోజులు తాను నిద్రలేని రాత్రులను గడిపానని తెలిపింది. బిడ్డను ఎప్పుడెప్పుడు ఎత్తుకుందామా అనే ఆత్రుతను అనుభవించానని చెప్పింది. ఇప్పుడు బిడ్డ కళ్లలోకి ప్రేమగా చూడటం, హత్తుకోవడం చేస్తూ కొత్త జీవితాన్ని ఆవిష్కరించుకుంటున్నానని తెలిపింది. అద్భుతమైన ఈ ప్రయాణాన్ని ఆనందంగా సాగిస్తున్నామని చెప్పింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు కానీ… అందంగా మాత్రం ఉంటారని తెలిపింది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కాజ‌ల్ అస్స‌లు ఆచార్య ఊసే ఎత్త‌డం లేదంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

mega fans fire on kajal aggarwal

Advertisement

Kajal Aggarwal : కోప‌మొచ్చింది..!

ఆచార్య‌లో న‌టించిన కాజ‌ల్ ఆ సినిమా అప్‌డేట్స్‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌క‌ముందు సినిమాల‌ని బాగానే ప్ర‌మోట్ చేశావు, ఇప్పుడేమైంది అంటూ మండిప‌డుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆచార్య.. రామ్ చరణ్ సిద్దా అనే కీలక పాత్ర పోషిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి రాబోతోంది. మూవీ రిలీజ్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.ఇటీవ‌ల ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా, ఇందులో కాజల్‌ని ఎక్కడ కూడా చూపించలేదు. దీనిపై కాజ‌ల్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి