
mega fans trolling on allu arjun due to he tweet about kalyan ram bimbisara
Allu Arjun : అల్లు అర్జున్ ను మరోసారి మెగా ఫ్యాన్స్ లోని కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నట్లుండి మెగా ఫ్యాన్స్ ఏమీ అల్లు అర్జున్ పై విరుచుకు పడలేదు. ఆయన చేసిన ట్వీట్ మెగా ఫ్యాన్స్ లో కొందరికి ఇబ్బందిగా ఉంది. అందుకే ఆయన్ని ఇప్పుడు బుద్ది లేదా అంటూ తిడుతూ విమర్శలు చేయడం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం అల్లు అర్జున్ కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ను చూస్తూ ఉంటే మెగా అభిమానుల్లో బన్నీ పై మరీ ఇంత వ్యతిరేకత ఉందా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అసలు విషయం ఏంటీ అంటే.. అల్లు అర్జున్ తాజాగా ట్విట్టర్ లో రెండు ట్వీట్స్ చేశాడు. ఆ రెండు ట్వీట్స్ కూడా నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార-Bimbisara సినిమాకు సంబంధించినది. బింబిసార సినిమా ను ప్రశంసిస్తూ… సినిమా సూపర్ హిట్ నేపథ్యంలో కళ్యాణ్ రామ్-Kalyan Ram ను అభినందిస్తూ ట్వీట్ చేయడం జరిగింది. కాస్త ఎక్కువగానే బింబిసార గురించి కళ్యాణ్ రామ్ గురించి అల్లు అర్జున్ స్పందించాడు అనేది కొందరు మెగా ఫ్యాన్స్-Mega Fans అభిప్రాయం. ఇప్పుడు అదే మెగా ఫ్యాన్స్ లో కొందరికి కోపం ను తెప్పిస్తుంది.
mega fans trolling on allu arjun due to he tweet about kalyan ram bimbisara
ఇటీవల నందమూరి ఫ్యాన్స్ కొందరు కళ్యాణ్ రామ్ ను మెగా స్టార్ అంటూ సంబోధించడం మొదలు పెట్టారు. ట్విట్టర్ లో మెగాస్టార్ కళ్యాణ్ రామ్ అంటూ ట్వీట్స్ చేయడం మొదలు పెట్టారు. దాదాపుగా 15 వేల మంది ఆ ట్వీట్స్ చేయడం తో జాతీయ స్థాయిలో ట్రెండ్ అయిన విషయం తెల్సిందే. ఆ ట్వీట్స్ ట్రెండ్ వెనుక కళ్యాణ్ రామ్ ఉండి ఉంటాడు అనేది కొందరి అభిప్రాయం. అందుకే మెగా స్టార్ ట్యాగ్ ను తన ముందు పెట్టుకున్న కళ్యాణ్ రామ్ కు ఎలా మీరు ప్రశంసలు ఇస్తారు అంటూ అభిమానులు ఆగ్రహంతో రగిలి పోతున్నారు. దీనికి బన్నీ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.