
Mega Hero Vaishnav Tej Comments On Ketika Sharma
Vaishnav Tej : మెగా కంపౌండ్ నుంచి మరో హీరో.. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో దూకుడుగా సినిమాలు చేస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన డెబ్యూ మూవీ ఉప్పెనతో హిట్ కొట్టిన వైష్ణవ్.. ఆ తర్వాత కొండపొలం సినిమాతో నటన పరంగా మెప్పించాడు. తాజాగా రంగరంగం వైభవంగా అనే సినిమాతో ఈ కుర్ర మెగా హీరో రాబోతున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా తాజాగా చిత్ర యూనిట్ ప్రమోషన్ నిర్వహించింది.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ -2న రంగరంగ వైభవంగా మూవీ థియేటర్ల ముందుకు రానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కేతిక శర్మ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మూవీప్రమోషన్‌లో భాగంగా మంగళవారం రాత్రి హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్బంగా హీరోయిన్ కేతికా శర్మ గురించి వైష్ణవ్ తేజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తొలుత తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన మెగా అభిమానులందరికీ థాంక్స్ చెప్పిన వైష్ణవ్ తేజ్.. సినిమా గురించి అందులోని క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడారు.
Mega Hero Vaishnav Tej Comments On Ketika Sharma
ఇక ఈ సినిమా డైరెక్టర్ గిరీషయ్యను తాను చాలా ఇబ్బంది పెట్టానని, అయినా కూడా ఆయన వాటన్నింటినీ భరించాడని వెల్లడించాడు. రొమాంటిక్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కేతికశర్మ గురించి మాట్లాడుతూ.. తన వల్లే ఈ సినిమాలో యాక్టింగ్ ఈజీగా కుదిరిందని.. అంతేకాకుండా కేతిక వల్లే నా సిగ్గు కూడా పోయిందంటూ కొంటెగా సమాధానం చెప్పాడు.తొలిసారిగా ఆమెతో నటించే సమయంలో రొమాంటిక్ ఫీలింగ్స్ వచ్చాయని నవ్వుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.ఈ సినిమాలో తనకు సపోర్టుగా నిలిచిన కేతికకు థాంక్స్ చెప్పిన వైష్ణవ్ తేజ్.. ఈ సినిమా కథ విన్నప్పుడు చాలా జెన్యూన్ అనిపించిందని వివరించాడు. మీరు కొనే టికెట్‌కు ఈ సినిమా తప్పకుండా న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.