Mega Vs Nandamuri Fans war latest
Mega Vs Nandamuri Fans : ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్.టి.ఆర్, చరణ్ తో తీసిన రాజమౌళి ఎక్కడ ఒకరిని ఎక్కువ మరొకరిని తక్కువ చేసి చూపించలేదు. మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య ఉన్న రగడ గురించి ముందే ఒక ఆలోచన ఉన్న రాజమౌళి రెండు పాత్రలని చాలా పవర్ ఫుల్ గా రాసుకున్నాడు. అంతే పవర్ ఫుల్ గా తెర మీద చూపించగలిగాడు. అయితే ఆ సినిమా వల్ల కాని గొడవలు మరో సినిమా వల్ల అవుతున్నాయి. మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాడు ఉప్పెన డైరక్టర్ బుచ్చి బాబు.
ఉప్పెనతో తొలి సినిమానే సెన్సేషనల్ హిట్ అందుకున్న ఇతగాడు తన సెకండ్ మూవీ తారక్ తో చేయాలని తెగ ఆరాటపడ్డాడు. అనుకున్నట్టుగానే ఎన్.టి.ఆర్ కి కథ చెప్పగా ఫస్ట్ హాఫ్ వరకు ఓకే సెకండ్ హాఫ్ నాట్ ఓకే అన్నాడు. ఎంత ట్రై చేసినా సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో బుచ్చి బాబు ప్రాజెక్ట్ వద్దనుకున్నాడు తారక్. ప్రస్తుతం చేస్తున్న కొరటాల శివ తర్వాత ప్రశాంత్ నీల్ తో మూవీ ఫిక్స్ చేసుకున్నాడు. ఇక తారక్ కాదనడంతో చరణ్ ని పట్టుకున్నాడు బుచ్చి బాబు.
Mega Vs Nandamuri Fans war latest
ఆ కథనే కొద్దిగా మార్చేసి చరణ్ కి చెప్పడట. చరణ్ ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడు. అయితే ఎన్.టి.ఆర్ కాదనుకున్న కథను చరణ్ చేయడంతో మళ్లీ ఫ్యాన్స్ మధ్య రగడ మొదలైంది. మా హీరో కథ మీ హీరో చేస్తున్నాడని అని వీళ్లు.. మీ హీరో చేయాలని లేదు అందుకే మా హీరోకి వచ్చిందని వాళ్లు ఇలా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఏది ఏమైనా మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య ఈ గొడవ హాట్ హాట్ గా మారింది. ఆర్.ఆర్.ఆర్ టైం లో కూడా ఈ ఫ్యాన్స్ మధ్య గొడవ జరగలేదు. మరి ఈ టైం లో ఈ ఫ్యాన్ వార్ పై ఆ ఇద్దరు హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.