Bigg Boss 8 Telugu : తెలుగు బుల్లితెర షో బిగ్ బాస్ కార్యక్రమం రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. తాజాగా బీబీ హోటల్ టాస్క్ పూర్తి అయిపోయింది. ఈ టాస్క్‌లో రాయల్ క్లాన్‌లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన ఆరుగురి పేర్లు చెప్పాల్సిందిగా సభ్యులకు బిగ్ బాస్ చెప్పాడు. అలాగే, ఓజీ క్లాన్‌లో ఎవరికీ ఎన్ని స్టార్స్ వచ్చాయో చెప్పాలని బిగ్ బాస్ అడిగాడు. దాంతో నబీల్ దగ్గర రెండు, మణికంఠ వద్ద రెండు స్టార్స్ ఉండగా.. నిఖిల్, ప్రేరణ, యష్మీ వద్ద చెరో స్టార్ ఉందని చెప్పారు. ఈ క్రమంలో ఓజీ క్లాన్ నుంచి మణింకఠ పోటీలో నిలబడగా..రాయల్ క్లాన్ నుంచి 6 మంది పోటీదారులు వచ్చారు. లో చివరి రౌండ్ వరకూ మెహబూబ్, మణింకఠ, హరితేజ, అవినాష్ టాస్క్ లు గెలుస్తూ వచ్చారు.
ఇక ఫైనల్ టాస్క్ లో మెహబూబ్ చివరి వరకూ నిలిచి గెలవడంతో.. మెగా చీప్ గా ఎన్నికయ్యారు. అప్పటి వరకూ మెగా చీఫ్ గా ఉన్న నబిల్ తన చేతికి ఉన్న బ్యాండ్ ను మెహబూబ్ కు అందించడం జరిగింది. ఇక ఈ మెగా చీఫ్ పోటీలో ఓజీ క్లాన్ నుంచి పోటీకి నిలిచిన మణికంఠ.. గట్టి పోటీ ఇచ్చాడు. టాస్క్ లో తన 100 బెస్ట్ అందించాడు. కాకపోతే చివరి నిమిషయంలో గాలి గట్టిగా వీచి.. తాను చేస్తున్న బ్యాలెన్సింగ్ టాస్క్ లో తడబడ్డాడు. ఇక ఈ విషయంలో మణింకఠకు అందరి నుంచి అభినందనలు ఎదురవుతున్నాయి. టాస్క్ సమయంలో సంచాలక్ రాంగ్ డెసిషన్‌తో హరితేజకి అన్యాయం జరిగింది. మెహబూబ్ చివరి వరకు ఉన్న పూర్తి వరకు వస్తువులు పెట్టలేదు. కానీ, హరితేజ మాత్రం చివరి వస్తువు వరకు పెట్టింది. కాని హరితేజ రెండుసార్లు ఫౌల్ ఆడిందని నబీల్ చెప్పాడు.దాంతో ఆమెకి నిరాశే ఎదురైంది. ఇక ఈ వారం నామినేషన్స్‌లో యష్మీ, పృథ్వీరాజ్, సీత, విష్ణుప్రియ, మెహబూబ్, గంగవ్వ ఉన్నారు. వీరికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయినప్పటి నుంచి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి. ఈ బిగ్ బాస్ తెలుగు 8 ఓటింగ్‌లో ఈ వారం మొదటి నుంచి గంగవ్వ టాప్ ప్లేసులో దూసుకుపోతుంది.
గత వారం అందరి పై అరిచిన యష్మీ జనాల్లో నెగిటివిని అందుకుంది. దాంతో ఈ అమ్మడు ఎలిమినేట్ అవుతుందని అందరు అనుకున్నారు. కానీ గత రెండు, మూడు రోజులుగా యష్మీ ఫైర్ కనిపిస్తుంది. ఆటలో విజ్రంబిస్తుంది.. బెటర్ అండ్ క్యూట్ పర్ఫామెన్స్‌తో ఓటింగ్‌పై పైకి వచ్చేసింది. దాంతో రెండో స్థానంలో యష్మీ కొనసాగుతోంది. మూడో స్థానంలో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు. డేంజర్ జోన్‌లో ఉన్న పృథ్వీరాజ్ నాలుగో ప్లేసుకు చేరుకున్నాడు. పృథ్వీరాజ్ స్థానంలోకి విష్ణుప్రియ వెళ్లిపోయింది. విష్ణుప్రియకు 15.03 శాతం ఓటింగ్, 6,863 ఓట్లు పడ్డాయి. స్వల్ప తేడాతోనే విష్ణుప్రియ ఐదో స్థానంలోకి వెళ్లి డేంజర్‌లో పడిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడి పర్‌ఫార్మెన్స్ అంత ఆశాజనకంగా లేకపోవడంతో ఈ వారం ఆమె ఎలిమినేట్ కానుందని అంటున్నారు. చూడాలి..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.