Vijay Devarakonda : అర్జున్ రెడ్డితో టాప్ హీరోగా ఓ వెలుగు వెలిగిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాపులతో క్రేజ్ తగ్గించుకుంటున్నాడు. తాజాగా వచ్చిన లైగర్ చిత్రంతో విజయ్ గట్టి హిట్ కొడతాడని అందరు భావించారు. కాని ఈ చిత్రం కూడా విజయ్‌కి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా అభిమానులను నిరాశరపరచడం తెలిసిందే. ఈ నెల 25న లైగర్ సినిమా విడుదలైంది. మొదటి రోజు 33.12 కోట్లను ఈ సినిమా వసూలు చేసుకోగలిగింది. రెండో రోజుకు వచ్చే సరికి కలెక్షన్లు రూ.27 కోట్లకు తగ్గాయి. ఇక ముచ్చటగా మూడో రోజు కేవలం రూ.7.5 కోట్లనే వసూలు చేసుకుంది. రాను రాను కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న మైక్ టైసన్ లైగర్ చిత్రంలో నటించడం విశేషం. లైగర్ మూవీకి భారీ హైప్ ఏర్పడడంలో ఇది కూడా ఓ కారణం. రియల్ ఫైట్స్ లో ఛాంపియన్స్ ని మట్టికరిపించిన మైక్ తో ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఫైట్ చేశారు. కాగా లైగర్ మూవీ సెట్స్ లో మైక్ టైసన్ తనను తిట్టినట్లు విజయ్ దేవరకొండ తెలియజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఈ విషయాన్ని బయటపెట్టారు. షూటింగ్ సమయంలో చాలాసార్లు విజయ్ దేవరకొండ నన్ను తిట్టారు. అవి ఎలాంటి బూతులో నేను చెప్పను. అయితే ఆయన ప్రేమపూర్వకంగా తిట్టడం జరిగింది. అందుకే నేను చెప్పదల్చుకోవడం లేదన్నాడు.
మైక్ టైసన్ ఇక్కడి మ్యూజిక్ , ఫుడ్ ఇష్టపడతారని టైసన్ అన్నాడు. గతంలో మైక్ టైసన్ ఓసారి ఇండియాకు రాగా తనను చూడడానికి జనాలు పెద్ద ఎత్తున వచ్చారట. వాళ్ళను చూసి భయంతో హోటల్ గదిలోకి వెళ్లిపోయానని టైసన్ చెప్పాడట. విజయ్ దేవరకొండ టైసన్ గురించి చేసిన ఈ కామెంట్స్ ఆసక్తిరేపుతున్నాయి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా లైగర్. అనన్యాపాండే హీరోయిన్‌గా నటించింది. మొదటిరోజే ఈ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్ కాలేకపోయింది. దీంతో సినిమా చూసిన ప్రతీ ఒకరు నిరాశ వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో సినిమా ప్లాప్ అంటూ ట్రెండ్ కూడా అయ్యింది
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
Telangana Pharma Jobs : హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కంపెనీ మేనేజ్‌మెంట్‌లు…
This website uses cookies.