Home » Entertainment » Mokshagna New Look Goes Viral In Social Media
Entertainment

Mokshagna : మోక్షజ్ఞ లుక్ చూశారా.. ఇది అసలు సిసలు కటౌట్.. హీరో మెటీరియల్ రెడీ..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: November 30, 2024, 4:30 pm
Advertisement

Mokshagna : నందమూరి వారసుడు మోక్షజ్ఞ తన తొలి సినిమా ప్రకటనతో ఫ్యాన్స్ లో జోష్ నింపాడు. మోక్షజ్ఞ మొదటి సినిమా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వస్తుంది. హనుమాన్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ సినిమా వస్తుంది. ఈ సినిమా కూడా పురాణామల కథతో వస్తున్నట్టు టాక్. సినిమాలో మోక్షజ్ఞ అభిమన్యుడిగా కనిపిస్తాడని అంటున్నారు. ఐతే మొన్నటిదాకా మోక్షజ్ఞ లుక్ పై రకరకాల విమర్శలు వచ్చాయి. లుక్ వైజ్ అతన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేశారు. కానీ ప్రశాంత్ వర్మ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ లో మోక్షజ్ఞ లుక్ అదిరిపోయింది.

Advertisement

ఇక అది చాలదు అన్నట్టుగా లేటెస్ట్ గా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కొత్త లుక్ ని రివీల్ చేశాడు. మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ చూసి కటౌట్ అదిరిపోయింది. ఇది కదా హీరో మెటీరియల్ అంటూ నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎలాగు ప్రశాంత్ వర్మ సినిమా కాబట్టి సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మోక్షజ్ఞ ఎలా ఉంటాడన్న అందరి డౌట్లకి కొత్త లుక్ తో క్లారిటీ ఇచ్చాడు.

Mokshagna : మోక్షజ్ఞ లుక్ చూశారా.. ఇది అసలు సిసలు కటౌట్.. హీరో మెటీరియల్ రెడీ..!

Advertisement

Mokshagna మోక్షజ్ఞ మేకోవర్..

ఏది ఏమైనా సరే మోక్షజ్ఞ మేకోవర్ నందమూరి ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. ఇక సినిమా మొదలు పెట్టడమే తరువాయి కచ్చితంగా అతన్ని అభిమానించేందుకు రెడీ అవుతున్నారు. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ సినిమా షూటింగ్ డిసెంబర్ 5న మొదలవుతుందని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాకు టైటిల్ ఇంకా మిగతా విషయాలు త్వరలో రానున్నాయి. మొన్నటిదాకా అసలు మోక్షజ్ఞ ని చూసి విమర్శించిన వారంతా కూడా ఇప్పుడు అతని లుక్ చూసి వావ్ అనేస్తున్నారు. హీరో లుక్ తో మోక్షజ్ఞ అదరగొట్టేస్తున్నాడు. లుక్స్ ఓకే ఇక మోక్షజ్ఞ యాక్టింగ్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమా 2026 లో రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాతో రాబోతున్నారు. ఆ సినిమాలో రిషబ్ శెట్టి హనుమాన్ గా చేస్తున్నారని తెలిసిందే. Mokshagna New Look Goes Viral in Social media , Mokshagna, Prashanth Varma, Social Media, Nandamuri Family, Balakrishna,

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి