Mr Bachchan : మాస్ మహరాజా రవితేజకి బ్యాడ్ టైం నడుస్తుంది. ఏ సినిమా చేసిన కూడా అది బాక్సాఫీస్ దగ్గర తేలిపోతుంది.ధమాకా’ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం చూస్తున్న ఆయన.. ఇప్పటికే ఎన్నో చిత్రాలతో వచ్చాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలతో రూపొందిన ఈ చిత్రం ఆశించిన విధంగా ప్రదర్శన చేయట్లేదు. హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర తదితరులు నటించారు.
మిస్టర్ బచ్చన్ మూవీకి నైజాంలో రూ. 11.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 11.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 31.00 కోట్లు బిజినెస్ చేసింది. అయితే భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఈ సినిమా రెండో రోజు దారుణమైన కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. నెగటివ్ టాక్ వల్ల దాదాపు అన్ని ఏరియాల్లో భారీ డ్రాప్స్ ఏర్పడ్డాయి.
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.56 కోట్ల షేర్ కలెక్షన్స్ ను రాబట్టిన మిస్టర్ బచ్చన్.. రెండో రోజు కేవలం రూ. 80 లక్షలతో సరిపెట్టుకుంది. అలాగే ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 5.26 కోట్ల షేర్, రూ. 7.80 గ్రాస్ కలెక్షన్స్ వస్తే.. సెకండ్ డే రూ. 88 లక్షల షేర్, రూ. 1.65 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మిస్టర్ బచ్చన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 32 కోట్లు. ఇప్పటి వరకు సినిమా రూ. 6.14 కోట్ల షేర్, రూ. 9.45 గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ కొట్టాలంటే మొదటి రెండు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా రూ. 25.86 కోట్ల షేర్ ను వసూల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత పెద్ద టార్గెట్ ను అందుకోవడం నిజంకాని ఒక కలే అని సినీ విశేషకులు అంటున్నారు. చూస్తుంటే ఈ సినిమాకి ప్రమోషన్ ఖర్చు కూడా రావడం కష్టమే అని తెలుస్తుంది.
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
CBSE Board Exam 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నవంబర్ 20, 2024 బుధవారం…
This website uses cookies.