Home » Entertainment » Mrunal Thakur Talks About The Offers In Cinema Industry
Entertainment

Mrunal Thakur : సిగ్గు పడితే ఇక్కడ డబ్బులు సంపాదించలేం.. ఆ విషయంలో అస్సలు మొహమాటపడొద్దు అంటున్న మృణాల్ ఠాకూర్

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 19, 2022, 12:40 pm
Advertisement

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్, Mrunal Thakur, తెలుసు కదా. సీతారామం సినిమాతో తను ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. అంతకు ముందు తను చాలా సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు కానీ.. సీతారామం సినిమాతో తను ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. తను ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా సీరియల్స్, సినిమాల్లో నటించిన అనుభవం తక్కువగానే ఉన్నా.. ఒక్క సినిమాతో జాక్ పాట్ కొట్టేసింది.

Advertisement

తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. అయితే.. సీతారామం సినిమాలో తను చాలా హోమ్లీగా చీరకట్టుకొని నటించింది. ఏమాత్రం అందాలను ఆరబోయలేదు. కానీ.. ఇప్పుడు తను ఎక్స్ పోజింగ్ చేస్తే చూడలేమని జనాలు అంటున్నారు. సీత పాత్రలో చూసిన మృణాల్ ను మళ్లీ వేరే పాత్రల్లో ఎలా చూస్తాం అంటున్నారు. అయితే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ అసలు హీరోయిన్లు ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. అయితే.. రెమ్యునరేషన్ విషయంలో అస్సలు మొహమాటపడకండి

Mrunal Thakur talks about the offers in cinema industry

Advertisement

Mrunal Thakur : రెమ్యునరేషన్ విషయంలో అస్సలు మొహమాటపడకండి అంటున్న మృణాల్

అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. హీరోయిన్స్ పారితోషికం విషయంలో మొహమాటపడితే సంపాదించుకోలేరని.. దర్శకనిర్మాతలకు కావాల్సినట్టుగా మనం నటించినప్పుడు.. మనకు కావాల్సినంత డబ్బును డిమాండ్ చేయడంలో తప్పేముంది అంటూ చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. అవును.. ఆమె చెప్పింది నిజమే కదా.. అంటూ కొందరు ఆమెను సపోర్ట్ చేస్తున్నా మరికొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఏ విషయాన్ని అయినా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టుగా మృణాల్ మాట్లాడుతుంది అని మరోసారి రుజువు చేసింది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి