MS Dhoni movie with Nayanathara
MS Dhoni : భారతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు ధోని.అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన ధోని ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై కింగ్స్ టీమ్‌ను ఆయన లీడ్ చేస్తున్నారు. క్రికెట్‌తో పాటు కమర్షియల్ యాడ్స్‌లోనూ ధోని హవా కొనసాగుతోంది. వీటితో పాటు ధోని మరో రంగంలోనికి అడుగు పెట్టబోతున్నారనే వార్తలు సినీ రంగంలో హల్ చల్ చేస్తున్నాయి. ఇన్నాళ్లూ క్రికెట్ బ్యాట్ పట్టి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కులు చూపించిన మన ధోని.. వికెట్ కీపర్‌గా అద్భుతంగా రాణించిన మన క్రికెట్ వీరుడు సిల్వర్ స్క్రీన్‌పై డాన్సులు, ఫైట్స్ చేస్తారా అనే సందేహం కలుగకమానదు.
అయితే ధోని ఇప్పుడు నిర్మాతగా సందడి చేయనున్నట్టు తెలుస్తుంది.ధోని నిర్మించనున్న తొలి తమిళ చిత్రంలో నయనతార ప్రధాన పాత్రలో నటిస్తుందని సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్ సన్నిహితుడు సంజయ్‌తో పాటు నయనతార నటించనుందని సమాచారం. ధోనీ తొలి చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోందని… ప్రస్తుత ఐపీఎల్ సీజన్ తర్వాత దీనిపై అధికారికంగా ప్రకటన రావచ్చని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ నెలలోనే.. అంటే ఐపీఎల్ ముగిసిన వెంటనే.. సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. అంటే ఈ లెక్క.. ఎంఎస్ ధోనీ తమిళ చిత్ర సీమలో పనిచేయబోతున్నాడు. క్రికెట్ తర్వాత.. తన సినిమాలతో తమిళ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకోబోతున్నాడు.
MS Dhoni movie with Nayanathara
ఈ సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పేసి.. సినిమాలపై పూర్తిగా దృష్టిసారిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక త్వరలోనే విఘ్నేశ్ శివన్-నయనతారలు తమ సుదీర్ఘ ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. పెళ్లి బంధంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు నయన్ కూడా.. ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉంది. అందులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో అట్లీ దర్శకత్వంలో సెట్స్‌పై ఉంది. ఒకవేళ ఇప్పుడు వచ్చేవార్తలు నిజమైతే నయనతార సినిమా ప్రమోషన్స్‌కు హాజరు కాననే కండీషన్ పెట్టే సినిమాలో యాక్ట్ చేయడానికి ఓకే చెబుతుంది. మరి ధోని సినిమాకు కూడా అలాంటి కండీషనే పెట్టిందా! అని చూడాలి.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.