Home » Entertainment » Ms Raju Clarity On Movie With Mahesh Babu
Entertainment

‘ఒక్కడు-2’పై క్లారిటీ.. ఎంఎస్ రాజు దూకుడు మామూలుగా లేదు

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: January 2, 2021, 11:23 am
Advertisement

గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే విషయం హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. మామూలుగా నిర్మాత ఎంఎస్ రాజు ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యాడు. నిర్మాత కాస్త దర్శకుడిగా మారి తీసిన చిత్రం డర్టీ హరి. ఈ మూవీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాపై పాజిటివ్ కామెంట్స్ ఎన్ని వస్తున్నాయో.. నెగెటివ్ కామెంట్స్ కూడా అన్నే వస్తున్నాయి. అయితే వాటన్నంటికి ఎంఎస్ రాజు రిప్లై ఇస్తూ వస్తున్నాడు.

Advertisement

MS Raju Clarity On Movie with Mahesh babu

ఈ క్రమంలో ఓ నెటిజన్ ఓ మాట అడిగాడు. మహేష్ ఫ్యాన్స్‌కి మాట ఇవ్వండి సర్.. మహేష్ సర్‌తో మూవీ ఉందని చాలు అంటూ కామెంట్ చేశాడు. దీనికి ఎంఎస్ రాజు స్పందిస్తూ ఉంది అంటూ కామెంట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ నెట్టింట్టో ఫుల్ వైరల్ అవుతోంది. అంతకు ముందు ఓ సారి నెటిజన్ ఇలాంటి ఓ ప్రశ్నే అడిగాడు. మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నారట నిజమేనా? సర్ అని అడిగాడు. కథ కుదిరితే తప్పకుండా చేస్తాను అని ఎంఎస్ రాజు రిప్లై ఇవ్వడంతో ఒక్కడు సీక్వెల్ తెరపైకి వచ్చింది.

Advertisement

ఎంఎస్ రాజు మహేష్ బాబు గుణ శేఖర్ కాంబోలో వచ్చిన ఒక్కడు సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసింది. మహేష్ బాబును స్టార్‌గా నిలబెట్టేసింది. అయితే ఇప్పుడు ఎంఎస్ రాజు మహేష్ బాబుతో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్నట్టు కనిపిస్తోంది. మహేష్ బాబు మీరు చేసేది ఒక్కడు సీక్వెలా? ఇంకేదైనా సినిమానా? ఎప్పుడు చేస్తారు? డీటైల్స్ చెప్పండి ప్లీజ్ అంటూ నెటిజన్లు కోరారు. దీనికి ఎంఎస్ రాజు రియాక్ట్ అవుతూ.. వచ్చే నెలలో చెబుతాను అంటూ క్లారిటీ ఇచ్చాడు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి