
పుష్ప .. అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అర్జున్ ఫస్ట్ టైం కంప్లీట్ కల్ట్ కంటెంట్ ఉన్న స్టోరీలో నటిస్తున్నాడు. ఇక రష్మిక మందన్న ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రెండు సినిమాలు క్లాస్ హిట్స్ గా నిలిచాయి. కాని పుష్ప మాత్రం ఆ రెండు సినిమాలకి పూర్తి భిన్నంగా తెరకెక్కుతోంది.
అల్లు అర్జున్ .. అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ రికార్డ్ సాధించిన సినిమా తర్వాత వస్తున్న పుష్ప సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే పుష్ప సినిమా మీద బాలీవుడ్ లో కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాలో స్పెషల్ ఐటెం సాంగ్ కంపోజ్ చేస్తున్నాడు దేవీశ్రీప్రసాద్. దేవీశ్రీప్రసాద్ కంపోజ్ చేసే ఐటెం సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేస్తుంటుందన్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు రాబోతున్న పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ నెవెర్ బిఫోర్ అన్నట్టుగా దేవీశ్రీప్రసాద్ తయారు చేస్తున్నాడట. ఇక ఈ ఐటెం సాంగ్ లో అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులేసెందుకు గత కొన్ని రోజులుగా పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. వీరిలో ప్రముఖంగా ఊర్వశీ రౌతెల, దిశా పఠాని పేర్లు ఎక్కువగా ప్రచారంలో నిలిచాయి. కాగా దిశా పఠాని ని ఫైనల్ చేసినట్టు సమాచారం. అంతేకాదు ఈ హాట్ బ్యూటికి ఏకంగా కోటి రూపాయలు ముట్టచెబుతున్నారట. మరి ఇంత కాస్ట్లీ ఐటెం సమగ్ ఎలా ఉంటుందో చూడాలి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.