
janaki kalaganaledu 27 july 2022 full episode
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 21 మార్చి 2022, ఎపిసోడ్ 261 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓవైపు నిశ్చితార్థం జరుగుతుండగా.. జానకిని పిలుస్తుంది మల్లిక. లోపలికి పిలిచి.. నిశ్చితార్థం నువ్వు ఆపుతావా.. నన్ను ఆపమంటావా అని అడుగుతుంది మల్లిక. దీంతో జానకి షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు మల్లిక నువ్వు. నిశ్చితార్థం ఆపించడం ఏంటి అంటుంది. దిలీప్, వెన్నెల ప్రేమించుకున్న విషయం మీ అత్త పోలేరమ్మ దగ్గర దాచి.. నువ్వు, రామా, వెన్నెల కలిసి ఆడుతున్న నాటకం నాకు లీక్ అయిపోయిందన్నమాట అంటుంది మల్లిక.
myravathi takes shocking decision about janaki after learning vennela love in janaki kalaganaledu
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. దిలీప్ వాళ్లు మీ బంధువులు అని నువ్వు చెప్పిన అబద్ధం కూడా నాకు తెలిసిపోయిందన్నమాట. అందుకే నువ్వు వెళ్లి నువ్వు చెప్పిన అబద్ధాలు, ఆడిన నాటకాలు చెప్పేసి ఈ నిశ్చితార్థం ఆపేయవా అంటుంది మల్లిక. దీంతో మల్లిక పాపం వాళ్లు అంటూ ఏదో చెప్పబోతుంది జానకి. దీంతో తెలుసు నాకు.. నువ్వు ఏం చెప్పబోతున్నావో నాకు తెలుసు అంటుంది మల్లిక. ఇది జీవితానికి సంబంధించిన మ్యాటర్. దయచేసి అర్థం చేసుకో అంటుంది జానకి. దీంతో నీకు రెండే రెండు దారులు. నిశ్చితార్థం నువ్వు ఆపుతావా.. లేక నేను ఆపనా అంటుంది మల్లిక.
నీ అంతట నువ్వే చెబితే.. కనీసం నువ్వు నీ తప్పు తెలుసుకున్నావని అనుకుంటారు. అదే నేను చెబితే.. జీవితాంతం నిన్ను ఆ పోలేరమ్మ క్షమించదు.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మల్లిక. ఇంతలో నిశ్చితార్థం తాంబూలాలు మార్చుకుంటారు. తర్వాత ఉంగరాలు మార్చుకోండి అని చెబుతాడు పూజారి.
జ్ఞానాంబ ఉంగరాలు ఇవ్వండి అంటుంది మైరావతి. దీంతో జానకిని పిలుస్తుంది జ్ఞానాంబ. జానకి ఏది.. అని అడుగుతుంది. ఇంతలో జానకి ఉంగరాలు తీసుకొని వస్తుంది కానీ.. ఆ ఉంగరాలను జ్ఞానాంబకు ఇవ్వదు. దీంతో రామా తీసుకొని ఆ ఉంగరాలను జ్ఞానాంబకు ఇస్తాడు.
సరిగ్గా వెన్నెల.. దిలీప్ కు ఉంగరం తొడిగే సమయానికి.. మల్లిక వచ్చి ఆపండి అంటుంది. ఎందుకు అని మైరావతి అడుగుతుంది. మా అత్తయ్య పరువు కాపాడుదామని.. ఆమె ముద్దుల కోడలు జానకి తనను వెన్నుపోటు పొడవకుండా ఆపుదామని అత్తయ్య గారు అంటుంది మల్లిక.
మీ పెద్దకొడుకు, వెన్నెలతో పాటు.. మీ పెద్ద కోడలు జానకి అందరూ కలిసి పెద్ద గూడుపుఠాణీ చేశారండి. అందరూ ఆస్కార్ స్థాయిలో నటించి మిమ్మల్ని పిచ్చోళ్లను చేశారు అత్తయ్య గారు అంటుంది మల్లిక. దీంతో అందరూ షాక్ అవుతారు.
వాళ్లు ఆడిన నాటకం మొత్తం చెబుతుంది మల్లిక. దీంతో నిశ్చితార్ధాన్ని క్యాన్సిల్ చేస్తుంది జ్ఞానాంబ. ఆ తర్వాత మైరావతి దగ్గరికి వెళ్లి అత్తయ్య గారు ఆ రోజు మీరు చెబితే నేను వినలేదు. ఈరోజు తన విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం నాకు లేదు అంటుంది జ్ఞానాంబ.
ఈ సమస్యను మోసం చేసిన వాళ్లను మీ దగ్గరే వదిలేసి వెళ్తున్నాను. ఈ నిర్ణయం తీసుకుంటారో.. ఎలాంటి శిక్ష వేస్తారో మీ ఇష్టం అని చెప్పి జానకిని అక్కడే వదిలేసి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. దీంతో మైరావతికి ఏం చేయాలో అర్థం కాదు. నువ్వు చేసిన తప్పుకు ఏ శిక్ష వేసినా తప్పులేదు అంటుంది మైరావతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.