Home » Entertainment » Mythri Movie Maker Wants To Return Money To Pawan Kalyan
Entertainment

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నుండి మైత్రి వారికి రూ.40 కోట్లు వచ్చేది ఎలా భయ్యా..!

Authored By
aruna
The Telugu News | Published on: August 9, 2022, 8:40 pm
Advertisement

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం వల్ల రెండు వైపుల పూర్తి న్యాయం చేయలేక పోతున్నాడు అంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో నటిస్తున్న వ్యక్తి రాజకీయాలు టైమ్‌ పాస్ కు చేస్తున్నాడు అంటూ రాజకీయాల్లో ఆయన గురించి విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్‌ సరైన డేట్లు ఇవ్వలేక పోవడంతో చాలా మంది టెక్నీషియన్స్ ఆయన వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఆయన డేట్ల కోసం ఎదురు చూస్తూ ఎంతో మంది ప్రముఖ దర్శకులు తమ విలువైన సమయంను వృదా చేసుకుంటున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి.

Advertisement

క్రిష్ వంటి విభిన్న చిత్రాల దర్శకుడు హరి హర వీరమల్లు సినిమా కోసం రెండు సంవత్సరాలకు పైగా పవన్‌ వద్దే ఉండి పోయాడు. ఆయన మరో హీరోతో అయితే కేవలం ఆరు నెలల్లోనే ఆ సినిమాను ముగించేవాడు. కాని ఇప్పటి వరకు హరి హర వీరమల్లు సినిమా ఎప్పటికి ముగుస్తుందో అర్థం కాక క్రిష్ జుట్టు పీక్కుంటున్నాడు. ఇదే సమయంలో క్రిష్ తో పాటు మరి కొందరు దర్శకులు కూడా పవన్ వల్ల ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు అనేది టాక్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మైత్రి మూవీ మేకర్స్ వారు పవన్ కళ్యాణ్‌ ని ఒత్తిడి చేస్తున్నారట.

Mythri movie maker wants to return money to Pawan Kalyan

Advertisement

టాలీవుడ్‌ వర్గాల వారి సమాచారం ప్రకారం మైత్రి మూవీ మేకర్స్ వారు కొన్ని సంవత్సరాల క్రితం పవన్‌ కళ్యాణ్ తో ఒక సినిమాను నిర్మించేందుకు గాను ఏకంగా 40 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగిందట. ఆ మొత్తం ఇప్పుడు తిరిగి ఇవ్వాల్సిందే అంటూ వారు డిమాండ్ చేస్తున్నారట. మొన్నటి వరకు పవన్‌ కళ్యాణ్ తో సినిమా నిర్మించేందుకు ఏర్పాట్లు చేసిన వారు ఇప్పుడు ఆయన యాత్ర కారణంగా సినిమాకు ఇప్పట్లో డేట్లు ఇవ్వలేడు అని తేల్చుకుని తమకు ఇవ్వాల్సిన మొత్తంను తిరిగి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారట. మరి ఎప్పటికి మైత్రి వారికి పవన్ కళ్యాణ్‌ సెటిల్‌ చేస్తాడో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ వద్ద అంత మొత్తం ఉన్నాయా.. లేదంటే వారికి సినిమా చేసి పెడతాడా అనేది చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి