Nabha Natesh deceived by believing in those heroes Acting Chance
Nabha Natesh : నభానటేశ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ మాస్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇస్మార్ట్ శంకర్ మూవీ విజయం సాధించడంతో ఈ అమ్మడికి అవకాశాలు భారీగా వచ్చాయి.అయితే, ఆమె అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ రామ్‌తో వచ్చిన హిట్ తర్వాత ఆమె నటించిన ఏ ఒక్కమూవీ కూడా విజయం సాధించలేదు. దీంతో నభా ప్రస్తుతం చేతిలో అవకాశాలు లేక దిక్కులు చూస్తోంది. ఒక్కచాన్స్ ప్లీజ్ అంటూ వేడుకుంటోంది. అందుకోసం అందాల ఆరబోతకు సైతం ఓకే అంటున్నట్టు తెలుస్తోంది.
నభా నటేశ్ తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువే. వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. ఈ హాట్ బ్యూటీ కన్నడం, తమిళంలోనూ పలు సినిమాల్లో నటించింది. తెలుగులో నన్నుదోచుకుందువటే, అదుగో సినిమాలతో నటనా పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయినా హీరోయిన్‌గా మాత్రం నభాకి స్టార్ ఇమేజ్ దక్కలేదు.ఈ టైంలోనే పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ రూపంలో ఓ సాలిడ్ ఆఫర్‌తో పాటు హిట్ కూడా ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన మరో హీరోయిన్ కూడా నటించింది. ఆమె మరెవరో కాదు నిధి అగర్వాల్. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత పూరి అందుకున్న భారీ కమర్షియల్ హిట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ అని చెప్పుకోవచ్చు.ఆ సినిమా మంచి విజయం సాధించడంతో అటు నిధి అగర్వాల్, నభా నటేష్‌లకు మంచి ఆఫర్లు వచ్చాయని ఇండస్ట్రీలో టాక్.
Nabha Natesh deceived by believing in those heroes Acting Chance
అయితే, నభా మాత్రం ఇండస్ట్రీలోని ముగ్గురు హీరోలను నమ్మి చేతులారా అవకాశాలను పోగొట్టుకున్నదని తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత డిస్కోరాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో వంటి సినిమాలు చేసింది నభా నటేశ్.. హీరో నితిన్, బెల్లంకొండ శ్రీనుల మీద నమ్మకంతో అల్లుడు అదుర్స్, మాస్ట్రో సినిమాలకు ఓకే చెప్పింది. వీటికి ముందే రవితేజతో డిస్కోరాజా రూపంలో భారీ దెబ్బతిన్న నభా.. ఆ తర్వాత విడుదలైన సినిమాలు కూడా అట్టర్ ప్లాప్ అవ్వడంతో చేతిలో అవకాశాలు లేక ఇప్పుడు ఇబ్బందులు పడుతోంది.ఈ ముగ్గురు హీరోల నభా కెరీర్ రిస్కులో పడినట్టు అయ్యిందట.. దీంతో ఒక్క చాన్స్ ప్లీజ్ అని అవకాశాల కోసం వెతుకులాట ప్రారంభించినట్టు తెలుస్తోంది.
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
This website uses cookies.