Naga Babu : తెలుగు లో దాదాపుగా దశాబ్ద కాలంగా కొనసాగుతున్న జబర్దస్త్ కార్యక్రమాన్ని బీట్ చేయాలని చాలా ఛానల్స్ ప్రయత్నాలు చేశాయి.. ఇంకా చేస్తూనే ఉన్నాయి. కామెడీ షో లతో ఇతర షో లతో జబర్దస్త్ ను బీట్ చేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఏ ఒక్కటి సఫలం కాలేదు. కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ మా టీవీ లో కామెడీ షో ఒకటి వచ్చింది. అది అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత జీ తెలుగు లో అదిరింది అంటూ ఒక కార్యక్రమం వచ్చి ఆ షో కూడా దారుణంగా ప్లాప్ అయ్యింది. మళ్లీ మా టీవీ వారు జబర్దస్త్ కు పోటీ గా ఈసారి ఖచ్చితంగా విజయం సాధించాలని కామెడీ స్టార్స్ ను తీసుకు వచ్చారు.
కామెడీ స్టార్స్ ను రకరకాలుగా మార్చారు. అనేక విధాలుగా మార్పులు చేర్పులు తీసుకు వచ్చారు. చివరకు జబర్దస్త్ జడ్జ్ నాగబాబును కూడా కామెడీ స్టార్స్ లో కూర్చోబెట్టారు. ఆయన గతంలో కంటే ఎక్కువ నవ్వుతున్నారు. కాని రేటింగ్ మాత్రం రావడం లేదు. జబర్దస్త్ కు వస్తున్న రేటింగ్ లో కనీసం సగం రేటింగ్ కూడా రావడం లేదు. దాంతో నాగబాబు టీమ్ దిగులు చెందుతున్నారట. స్టార్ మా టీవీ లో ఏ షో అయినా అయిదు నుండి ఏడు వారాలు చూసి రేటింగ్ లేకుంటే మూసి వేయడం చేస్తారు. కాని కామెడీ స్టార్స్ కు మాత్రం ఛాన్స్ ఎక్కువ ఇచ్చారు.ఇప్పటికే చాలా వారాలుగా కామెడీ స్టార్స్ వస్తుంది.
కాని నచ్చలేదు. అయినా కూడా మరి కొన్నాళ్లు అంటూ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మరో అయిదు లేదా ఆరు వారాల పాటు కామెడీ స్టార్స్ ను నిర్వహించేందుకు నిర్వాహకులు ఫండ్స్ ఇచ్చారట. ఆ తర్వాత రేటింగ్ బాగుండి.. డబ్బులు భారీగా వస్తేనే కొనసాగించేది అంటూ గట్టిగా చెప్పారట. ఈ విషయంలో నాగబాబు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఈ అయిదు ఆరు వారాల్లో ఏమైనా మ్యాజిక్ జరిగి రేటింగ్ పెరిగితే కామెడీ స్టార్స్ కంటిన్యూ అవుతుంది. లేదంటే ఖతం అయినట్లే..!
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.