Naga Babu : నాగబాబు కామెడీ స్టార్స్ కు మరో 5 వారాలే సమయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Naga Babu : నాగబాబు కామెడీ స్టార్స్ కు మరో 5 వారాలే సమయం

 Authored By prabhas | The Telugu News | Updated on :26 May 2022,9:00 pm

Naga Babu : తెలుగు లో దాదాపుగా దశాబ్ద కాలంగా కొనసాగుతున్న జబర్దస్త్‌ కార్యక్రమాన్ని బీట్‌ చేయాలని చాలా ఛానల్స్ ప్రయత్నాలు చేశాయి.. ఇంకా చేస్తూనే ఉన్నాయి. కామెడీ షో లతో ఇతర షో లతో జబర్దస్త్‌ ను బీట్‌ చేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఏ ఒక్కటి సఫలం కాలేదు. కొన్ని సంవత్సరాల క్రితం స్టార్‌ మా టీవీ లో కామెడీ షో ఒకటి వచ్చింది. అది అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత జీ తెలుగు లో అదిరింది అంటూ ఒక కార్యక్రమం వచ్చి ఆ షో కూడా దారుణంగా ప్లాప్‌ అయ్యింది. మళ్లీ మా టీవీ వారు జబర్దస్త్‌ కు పోటీ గా ఈసారి ఖచ్చితంగా విజయం సాధించాలని కామెడీ స్టార్స్ ను తీసుకు వచ్చారు.

కామెడీ స్టార్స్ ను రకరకాలుగా మార్చారు. అనేక విధాలుగా మార్పులు చేర్పులు తీసుకు వచ్చారు. చివరకు జబర్దస్త్‌ జడ్జ్‌ నాగబాబును కూడా కామెడీ స్టార్స్ లో కూర్చోబెట్టారు. ఆయన గతంలో కంటే ఎక్కువ నవ్వుతున్నారు. కాని రేటింగ్‌ మాత్రం రావడం లేదు. జబర్దస్త్‌ కు వస్తున్న రేటింగ్‌ లో కనీసం సగం రేటింగ్‌ కూడా రావడం లేదు. దాంతో నాగబాబు టీమ్ దిగులు చెందుతున్నారట. స్టార్‌ మా టీవీ లో ఏ షో అయినా అయిదు నుండి ఏడు వారాలు చూసి రేటింగ్‌ లేకుంటే మూసి వేయడం చేస్తారు. కాని కామెడీ స్టార్స్ కు మాత్రం ఛాన్స్‌ ఎక్కువ ఇచ్చారు.ఇప్పటికే చాలా వారాలుగా కామెడీ స్టార్స్ వస్తుంది.

Naga Babu star maa tv comedy stars show rating

Naga Babu star maa tv comedy stars show rating

కాని నచ్చలేదు. అయినా కూడా మరి కొన్నాళ్లు అంటూ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మరో అయిదు లేదా ఆరు వారాల పాటు కామెడీ స్టార్స్ ను నిర్వహించేందుకు నిర్వాహకులు ఫండ్స్ ఇచ్చారట. ఆ తర్వాత రేటింగ్ బాగుండి.. డబ్బులు భారీగా వస్తేనే కొనసాగించేది అంటూ గట్టిగా చెప్పారట. ఈ విషయంలో నాగబాబు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఈ అయిదు ఆరు వారాల్లో ఏమైనా మ్యాజిక్ జరిగి రేటింగ్ పెరిగితే కామెడీ స్టార్స్ కంటిన్యూ అవుతుంది. లేదంటే ఖతం అయినట్లే..!

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది