
Naga Chaitanya and samantha are living together
Naga Chaithanya – Samantha : అక్కినేని నాగచైతన్య.. సమంత విడాకులు తీసుకుని దాదాపు ఏడాది కావస్తున్నా ఇంకా ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. రీసెంట్ గా నటుడు మురళి మోహన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుండటంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక సమంత చైతూ పేరు కూడా వినడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. వీరిద్దరూ విడిపోవడానికి సరైన కారణాలు ఇప్పటివరకు తెలియకపోయినప్పటికీ ఎన్నో రూమర్స్ వినిపించాయి. చట్టబద్దంగా ఇద్దరూ డైవర్స్ తీసుకున్నప్పటికీ పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఓ ఇంటర్వ్యూలో మురళి మోహన్ పలు విషయాలు బయటపెట్టడంతో సామ్ చైతూల విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే సమంత బాలీవుడ్ షో కాఫీ విత్ కరణ్ షోలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఈ షోలో కరణ్ అడిగిన ప్రశ్నలకు నాగ చైతన్య నా భర్త కాదు.. మాజీ భర్త మాత్రమే అన్న సమంత… మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచాల్సి వస్తే పదునైన ఆయుధాలు కూడా ఉంచాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కామెంట్స్ సమంతకు చైతూపై ఉన్న ద్వేషం, కోపాన్ని తెలియజేస్తున్నాయని అక్కినేని ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. కాగా చైతన్య మాత్రం ఎక్కడా అడిగినా చాలా కూల్ గా సమాధానం ఇస్తున్నారు. అయితే నాగ చైతన్య ఇష్టపడి కొనుకున్న అపార్ట్ మెంట్ లోని ఇల్లు గురించి పలు విషయాలు చెప్పిన మురళి మోహన్ మరిన్ని విషయాలు బయటపెట్టాడు.
ప్రస్తుతం సమంత గతంలో భర్తతో కలిసి జీవించిన ఇంటిలోనే ఉంటున్నారట. సమంత ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి గురించి కొన్ని విషయాలు మురళీ మోహన్ వెల్లడించారు. విడిపోక ముందు చైతన్యతో ఉన్న ఇంటిలోనే సమంత ఉంటున్నారని చెప్పుకొచ్చారు. సమంత చైతన్య కలిసి ఉన్నప్పుడు మా అపార్ట్మెంట్ లోని ఫెంట్ హౌస్ లో ఉండేవారు. కలిసి జీవించాలని ఓ ఇండివిడ్యువల్ హౌస్ కొనుగోలు చేశారు. అది నిర్మాణంలో ఉండగానే అపార్ట్మెంట్ లో ఉంటున్న ప్లాట్ అమ్మేశారు. అయితే కొత్తగా కొన్న ఇల్లు పూర్తయ్యే వరకు అక్కడే ఉంటామని కొన్న ఓనర్స్ ని ఒప్పించారు. కొత్తింటికి వెళ్లేలోపే వాళ్ళ మధ్య విభేదాలు రావడంతో విడిపోయారంటూ… చెప్పుకొచ్చారు.
ఇద్దరూ ఆ ప్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోయిన తర్వాత సమంత మరో ఇల్లు కొనడానికి ప్రయత్నించారు. కానీ ఎక్కడా నచ్చకపోవడంతో చైతూతో పాటు గతంలో ఉన్న ప్లాట్ కావాలి.. అదైతే సెక్యూరిటీ పరంగా, సౌకర్యాల పరంగా బాగుంటుంది అని మురళి మోహన్ ను అడిగిందట. అయితే అది వేరే వాళ్లకు అమ్మేశాం కదా అని చెప్పగా.. వాళ్లతో మాట్లాడమని సమంత రిక్వెస్ట్ చేయడంతో తను మాట్లాడి ఇప్పించినట్లు చెప్పాడు. ఆ ఇంట్లో వాళ్ల అమ్మతో పాటు సమంత మాత్రమే ఉంటారని మురళి మోహన్ చెప్పారు.
సమంత చైతూ జీవితంలోకి రాకముందే ఆ ఇంటిని నాగ చైతన్య కొనుక్కున్నారు. మురళీ మోహన్ తన అపార్ట్మెంట్ లో ఫ్యామిలీ కోసం పైన మూడు ఫెంట్ హౌస్లు నిర్మించారు. అనుకోకుండా ఆ హౌసెస్ చూసిన నాగ చైతన్య మురళీమోహన్ తో ఒకటి నాకు కావాలి అన్నాడు. అవి మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం కట్టినవి అమ్మడం కుదరదని చెప్పడంతో చైతూ నాగార్జునతో మాట్లాడించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలతో ఆ ఫెంట్ హౌస్ చాలా ఆహ్లాదంగా ఉంటుందట. అందుకే మనసు పడి ఆ ఇంటిని సొంతం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఆ ఇంటిలోనే సమంతతో కాపురం పెట్టగా.. ఆ ఇంట్లోనే ఇద్దరూ విడిపోయారు.
Vijayasai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన…
School Holidays : సంక్రాంతి పండుగతో ముగిసిన సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ, ఈ నెలాఖరులో విద్యార్థులకు…
Renu Desai Mahesh Babu : రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో హీరోయిన్‌గా…
Mana Shankara Vara Prasad Garu Hook Step: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘…
Bhatti Vikramarka : ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర…
Palnadu : పల్నాడు జిల్లా రాజకీయాల్లో గత పాలన, ప్రస్తుత పాలన మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర మంత్రి…
Bank of Bhagyalakshmi Movie Review : కన్నడలో రూపొందిన తాజా సినిమా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ లో దీక్షిత్…
Kalamkaval Movie Review : కొన్ని పాత్రలు చూసిన వెంటనే ఇది ఈ నటుడే చేయగలడు అనిపిస్తాయి. అలాంటి అరుదైన…
This website uses cookies.