Home » Entertainment » Naga Chaitanya Answer About Samantha
Entertainment

Naga Chaitanya : స‌మంత మ‌ళ్లీ మీ ముందుకు వ‌స్తే… షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చిన నాగ చైత‌న్య‌

Authored By
Sam C
The Telugu News | Published on: August 10, 2022, 2:40 pm
Advertisement

Naga Chaitanya : టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ చైత‌న్య‌- స‌మంత ఊహించ‌ని విధంగా గ‌త ఏడాది అక్టోబ‌ర్ 2న విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. వీరి విడాకుల విష‌యం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. విడాకులు తీసుకున్న‌ప్ప‌టి నుంచి వీరి నుంచి ఏ వార్త వచ్చిన పాపులర్‌గా మారుతోంది. సమంత ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో నాగ చైతన్య మీద ఇండైరెక్ట్ గా బాగానే ఫైర్ అయింది. దీనిపై చైతు ఫ్యాన్స్ సమంతని ట్రోల్ చేశారు కూడా. కానీ చైతు మాత్రం సమంత గురించి పాజిటివ్ గానే చెప్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న చైతూకు ర్యాపిడ్ ఫైర్ రౌండ్‏లో భాగంగా సమంత మళ్లీ ఎదురైతే ఏం చేస్తారు? అని యాంకర్ అడగ్గా..

Advertisement

ఆమెకు హాయ్ చెబుతానన్నారు.ఇక ప‌ర్స‌న‌ల్ లైఫ్‌, ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌పై ప్ర‌భావం ప‌డ‌కుండా చూసుకుంటాన‌ని చెప్పిన చైతూ.. ఈ రెండింటి మ‌ధ్య స్ప‌ష్ట‌మైన అడ్డంకుల‌ని ఏర్పాటు చేసుకున్న‌ట్టు తెలిపారు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన లాల్ సింగ్ చ‌ద్దా మూవీ ఆగస్ట్ 11న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.ఈ మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగాంగా నాగ చైత‌న్య ఈ వ్యాఖ్య‌లు చేశారు. రీసెంట్‌గా ”మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఆ విషయాన్ని అందరికి బహిరంగంగానే చెప్పాము. విడిపోయిన తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటున్నాము.

naga chaitanya answer about samantha

Advertisement

Naga Chaitanya : షాకింగ్ ఆన్స‌ర్..

విడాకులు తీసుకున్నా మాకు ఒకరిపై ఇంకొకరికి గౌరవం ఉంది. సమంతని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. సామ్ చేసే ప్రతి వర్క్‌ని చూస్తూనే ఉంటాను. మేం విడిపోయాక నావి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయినా అందరూ ఇంకా మా విడాకుల గురించే మాట్లాడుతున్నారు” అని అన్నాడు. కాగా, మొదట ఏ మాయ చేశావే సినిమాలో నటించిన నాగ చైతన్య- సమంత.. పెళ్లి తర్వాత మజిలీ సినిమాలో నటించారు. ఆ తర్వాత ఎవరి కెరీర్ పై వారు దృష్టి పెడుతూ వచ్చారు. డివోర్స్ తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు నాగ చైతన్య, సమంత.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి