
Samantha
Manam Movie : అక్కినేని ఫ్యామిలీకి, ప్రేక్షకులకు మనం మూవీ ఎంత స్పెషల్ ఫిల్మ్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అక్కినేని నాగేశ్వర రావు, ఆయన తనయుడు కింగ్ నాగార్జున, మనవడు నాగ చైతన్య కలిసి నటించి తెగ సందడి చేశారు. ఇక ఈ సినిమాలో అఖిల్, అమల కూడా చిన్న అతిథి పాత్రలలో కనిపించి సందడి చేస్తారు. అయితే ఈ సినిమా విడుదలై మే23కి పదేళ్లు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దేవి థియేటర్లో స్పెషల్ షో వేశారు. ఈ షోకి నాగ చైతన్య కూడా హాజరు కాగా ప్రేక్షకులు చైతూని చూసి తెగ గోల చేశారు.
దేవి థియేటర్ లో ఫ్యాన్స్ ఇప్పటికీ మనం చిత్రాన్ని సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత మధ్య సన్నివేశాలు వచ్చినప్పుడు స్క్రీన్ దగ్గరకి వెళ్లి మరీ వెళ్లి నానా రచ్చ చేశారు. సమంతతో నాగ చైతన్య పెళ్లి సన్నివేశం రాగానే ఫ్యాన్స్ సీట్లలోనుంచి లేచి గంతులేస్తూ చేస్తూ హంగామా చేశారు. నాగ చైతన్య ముందే ఫ్యాన్స్ గోల చేస్తుండడం, పెళ్లి సీన్ సన్నివేశానికి తెగ అరుపులు అరుస్తుండడంతో నాగ చైతన్య కాస్త చిరాకుగా వారిని కూర్చోమని చెబుతుంటాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
నాగ చైతన్య, సమంత నటించిన హిట్ చిత్రాల్లో మనం మూవీ ప్రత్యేకం అని చెప్పాలి. ఈ మూవీలో నటించే సమయంలో చై, సామ్ ప్రేమలో ఉన్నారు. 2017లో వివాహం చేసుకున్న చై, సామ్ ఫ్యాన్స్ కి షాకిస్తూ 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మనం చిత్రంలో నాగార్జునకి జోడిగా శ్రీయ, నాగ చైతన్యకి జంటగా సమంత నటించారు. వీళ్ల మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలైట్. ఈ చిత్రంలో నాగార్జునకి తండ్రిగా నాగ చైతన్య నటించారు. ఏఎన్నార్ కి తండ్రిగా నాగార్జున నటించారు. మనం సినిమాకి సీక్వెల్ తీయాలని ఎప్పటి నుండో అభిమానులు కోరుతున్నారు. మరి ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.